Friday, April 18, 2025
Homeవార్తలుమనువాదానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

మనువాదానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

  • అంబేద్కర్‌ అందరివాడు
  • సిపిఎం జిల్లా కార్య దర్శి నున్నా నాగేశ్వరరావు

ఖమ్మం, ఏప్రిల్‌ 14 (జనవిజయం): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి ఆర్‌ అంబేడ్కర్‌ కొందరి వాడు కాదని సమాజంలో అన్ని వర్గాలకు ఆదర్శ ప్రాయుడు అని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్రావు అన్నారు. సోమవారం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రం జడ్‌పి సెంటర్‌లో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అధికారులు, అంబేద్కర్‌ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన మనువాద విభజన రాజకీయాలను కొనసాగించుకునేందుకు అంబేద్కర్‌ను కేవలం కొన్ని తరగతులకు చెందిన వాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు కలిగిన వ్యక్తి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అయితే, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అత్యధిక విగ్రహాల ధ్వంసం కూడా బాబా సాహెబ్‌ వే అని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి పాలనలో దళితులపై హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయని బీసీలను కూడా మూకుమ్మడి గ్రామ బహిష్కరణ చేస్తున్న సందర్భాలు చూస్తున్నామని అన్నారు. అన్ని వర్గాలకు జాతులకు రాజ్యాంగం వల్ల ప్రయోజనం జరిగిందని అన్నారు. స్త్రీ సమానత్వం ఓటు హక్కు జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు అత్యున్నత న్యాయ సమీక్ష అధికారం వంటి అనేక అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచి ప్రజల స్వేచ్ఛ స్వాతంత్య్రాలను కాపాడిన మహోన్నతుడు డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ అని కొనియాడారు. రాజ్యాంగ పరిరక్షణ అంబేద్కర్‌కు మనం అర్పించే నిజమైన నివాళి అని ఆ దిశగా ప్రజా పోరాటాలకు ప్రజలు సమయాత్తం కావాలని పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్‌ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదినేని రమేష్‌ వై విక్రమ్‌ బండి పద్మ జిల్లా నాయకులు దొంగల తిరుపతిరావు, జబ్బర్‌, ఎస్‌.కె.వి.ఎ.మీరా, వాసిరెడ్డి వరప్రసాద్‌, ఎస్‌.కె. బషీరుద్దీన్‌, రమ్య నవీన్‌ రెడ్డి బండారు రమేష్‌ ఆర్‌.ప్రకాష్‌, నందిపాటి మనోహర్‌, మాచర్ల గోపాల్‌, పొన్నం వెంకటేశ్వరరావు, ఎం.సుబ్బారావు, చింతలచెరువు కోటేశ్వరరావు, తాళ్ల నాగరాజు, బోడపట్ల సుదర్శన్‌, తూశాకుల లింగయ్య, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, తుడుం ప్రవీణ్‌, పగడాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments