- పేద విద్యార్థి చదువులకు స్ఫూర్తి ఫౌండేషన్ చేయూత
సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రిల్ 19(జనవిజయం):కల్లూరు అంబేద్కర్ నగర్ కు చెందిన వేల్పుల చిన్ని మారుతీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ భద్రాచలంలో నర్సింగ్ 3 వ సంవత్సరం చదువుతుంది.తండ్రి ఆనందకుమార్ లారీ డ్రైవర్, తల్లి పద్మ కూలి పనులకు వెళ్తారు. ఆనందకుమార్ ఈ మధ్య కాలంలో హార్ట్ కు సంబంధించిన ఆపరేషన్ అయి ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పు చేసి హాస్పిటల్ కు కట్టి, ఇబ్బంది పడుతున్న సమయంలో చిన్ని కాలేజీ ఫీజు మరియు హాస్టల్ ఫీజు కట్టడం ఇబ్బందిగా ఉండటం వలన చిన్ని తల్లిదండ్రులు స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధి వరకా రామారావు ని కలిసి వారి ఆర్థిక పరిస్థితిని తెలిపారు. ఈ విషయాన్నీ రామారావు స్ఫూర్తి ఫౌండేషన్ ధాతలకు తెలియచేయగానే వెంటనే విద్యార్థి చదువుకయ్యే మొత్తం రూ. 75000/- చెక్ ను వరకా రామారావు ద్వారా చిన్నికి అందించారు. మా ఆర్థిక పరిస్థితి అర్ధం చేసుకుని అడిగిన వెంటనే సహాయం అందించిన స్ఫూర్తి ఫౌండేషన్ ధాతలకు విద్యార్థి, తల్లిదండ్రులు, బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.