- సమరయోధునికి మండల పరిషత్ నివాళులు
వేంసూరు,ఏప్రియల్05(జనవిజయం): ఖమ్మంజిల్లా వేంసూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ సమావేశ మందిరంలో భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు,మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ కు 117వ జయంతి సందర్భంగా శనివారం ఇన్చార్జ్ ఎంపీడీఓ పరిమి రాజారామ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.ముందుగా బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి సెల్యూట్ లు చేశారు.అనంతరం రాజారామ్ బాబు చేసిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎల్ డి సి శ్రీనివాస్,రామన్నపాలెం గ్రామ మాజీ సర్పంచ్. షేక్ నాగుల్ మీరా,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Nice