- గిరిదావర్ (2) గా జార్జి రాక
- నేరుగా ప్రజలు సంప్రదించండి
వేంసూరు,ఏప్రియల్11(జనవిజయం): ఖమ్మం జిల్లా వేంసూరు మండల రెవిన్యూ గిరిధావర్ (2) (ఆర్ ఐ) గా ఆర్ల జార్జి శుక్రవారం వేంసూరు ఇంచార్జీ తహశీల్దార్ బాబ్జీ ప్రసాద్ కు జాయినింగ్ ఆదేశాల పత్రాన్ని అందించి విధులకు హాజరయ్యారు.కార్యాలయ సిబ్బంది సాదరoగా స్వాగతం పలికారు.జార్జి ఇప్పటివరకు ఖమ్మంజిల్లా కారేపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో గిరిధావర్(2) గా పని చేసి వ్యక్తిగత అర్జీ పైన వేంసూరు కు బదిలీ అయ్యారు. ఆర్ల ను జనవిజయం దినపత్రిక ప్రతినిధి మల్లూరు చంద్రశేఖర్ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆర్ల మాట్లాడుతూ మండలంలోని కల్లూరుగూడెం, గూడూరు, అడసర్లపాడు, రామన్నపాలెం, కుంచపర్తి, కేజి మల్లెల, చౌడవరం, పల్లెవాడ, ఎర్రగుంటపాడు, మొద్దులు గూడెం, శంభునిగూడెం, జయలక్ష్మిపురం, చిన్నమల్లెల, నాయకులగూడెం గ్రామాలు తమ పరిధిలోకి వస్తాయని అట్టి గ్రామాల ప్రజలు తమ రెవిన్యూ సంబంధిత సమస్యలపై నేరుగా కార్యాలయ పని వేళలలో సంప్రదించాలని, పైరవీ కారులను నమ్మవద్దని సూచించారు.