- అంగరంగ వైభవంగా రాములోరి నవమి ఉత్సవాలు
- మహాన్నదానంలో పాల్గొన్న వేలాదిమంది భక్తులు
- అబ్బుర పరిచిన సాంస్కృతిక కార్యక్రమాలు
చాట్రాయి,ఏప్రియల్08(జనవిజయం):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో గల చాట్రాయి మండల పరిధిలోని చనుబండ గ్రామంలో స్వయంభువుగా వేంచేసి యున్న మూడొందల ఏళ్ల క్రితం రెడ్లు నిర్మించిన శ్రీ కోదండ రామాలయం- మరో భద్రాద్రి గా పేరు గాంచింది.శ్రీరామనవమి సందర్భంగా ఐదు రోజుల పాటు నవమి ఉత్సవాలు అత్యంత ఘనంగా పలు సంస్కృతిక కార్యక్రమాల నడుమ నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.భక్తుల విరాళాలతో నిర్వహించిన మహాన్నదాన కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల కు చెందిన హైందవ భక్తులు వేలాదిగా తరలి వచ్చారు.రథోత్సవాన్ని ఘనంగా వైభవోపేతంగా నిర్వహించారు.హరికథ కాలక్షేపం, భరత నాట్యం లాంటి వేడుకలు ఘనంగా నిర్వహించారు.సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అబ్బుర పరుస్తున్నాయి.