- నాకు బాబాసాహెబ్ ఆదర్శం
- నా తల్లితండ్రుల ప్రోత్సాహమే నన్ను విద్యావంతుడిని చేసింది!
- సర్కారు విద్యే టి.పి.బి.ఓ.గా తీర్చి దిద్దింది
సత్తుపల్లి,ఆర్సి,ఏప్రియల్07(జనవిజయం):నాకు రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితమే ఆదర్శమని ఖమ్మంజిల్లా సత్తుపల్లి పట్టణ పురపాలక సంఘం పరిధిలో టి.పి.బి.ఓ(టౌన్ ప్లానింగ్ బిల్డింగ్స్ ఆఫీసర్) గా నూతనంగా సర్కారు ఉద్యోగంలో చేరి పని చేస్తున్న యువ ఉద్యోగి మద్దెల వెంకటకిరణ్ ఆత్మీయంగా పలకరించిన నేటి ప్రజావాణి ప్రతినిధి మల్లూరు చంద్రశేఖర్ కు తెలిపారు.సత్తుపల్లి మండల పరిధిలోని రేజర్ల గ్రామానికి చెందిన దళిత వాడలో నివసించే వ్యవసాయ కూలీలు మద్దెల మోహనరావు – సునీత దంపతుల మొదటి కుమారుడు వెంకటకిరణ్.ప్రాథమిక విద్య నుండి తల్లి తండ్రులు చదువు కోసం ఇచ్చిన ప్రోత్సాహమే తనను విద్యావంతున్నీ చేసిందని మద్దెల తెలిపారు. స్వంత గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి 2015 సంవత్సరంలో పూర్తి చేసి మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలలో 9.5 ర్యాంక్ సాధించి మండలంలోనే టాపర్ గా నిలిచాడు.నాడు రేజర్ల పాఠశాల నుండి ఐ ఐ టి బాసర లో సీటు సాధించి బి.టెక్.సివిల్ ఇంజినీర్ విద్యను అభ్యసించి టి.జి. పి.ఎస్.సి.లో 22 సంవత్సరాల కే మున్సిపాల్టీలో టి. పి.బి. ఓ.గా సర్కారు కొలువు సాధించానని తెలిపాడు.చదువుకున్నే రోజులలో సెలవు దినాలలో కుటుంబానికి ఆసరాగా ఉండే దానికి పనులుకెళ్లి కుటుంబానికి ఆసరాగా నిలిచాడు.గ్రూప్ 4 ఏ ఈ లో కూడా మెరిట్ సాధించాడు వెంకట కిరణ్.చిరుప్రాయంలోనే ఉన్నత కొలువును అధిరోహించి ముందుకు సాగుతున్న యువకుడు మద్దెల – మత్తు పానీయాలకు,మద్యపానానికి,అసాంఘిక కార్యకలాపాలకు బానిసలుగా మారుతున్న యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.సర్కారు చదువే తనను టి. పి.బి.ఓ. గా తీర్చి దిద్దిందని వెంకట కిరణ్ తెలిపారు.