బోనకల్,ఏప్రిల్ 14(జనవిజయం): రాజ్యాంగ రూపశిల్పి,భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్బంగా ప్రెస్ క్లబ్ -1 ఆధ్వర్యంలో రావినూతల ఉన్నత పాఠశాల వద్ద ఉన్న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ప్రెస్ క్లబ్-1 ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డేగల వేలాద్రి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటరానివారుగా పరిగణించబడే పేద కుటుంబంలో పుట్టినా ఎదురుచూపులు కాచుకుంటూ ఎదిగి వచ్చారన్నారు. సాంఘిక పరమైన ఆర్థికపరమైన అవమానాలతో నిరంతరం పోరాడుతూ స్వయంకృషితో పైకి వచ్చారు.ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ విదేశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసి జాతి గర్వించే స్థాయికి ఎదిగారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు బానోతు శ్రీనివాస్ రాథోడ్,మందా సత్యానందం,, షేక్ బాజీ షరీఫ్, ఎస్ కే బడే, దారెల్లి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.