- కా” యర్ర శ్రీకాంత్ కు సీపీఎం, సిఐటియు మండల కమిటీ సంతాపం
వేంసూరు,ఏప్రిల్6(జనవిజయం) : సిఐటీయు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు యర్ర శ్రీకాంత్ కు సిపియం పార్టీ జాతీయ మహాసభలకు హాజరై సభల చివర రోజున అగస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వారి మరణానికి CPM వేంసూరు మండల కమిటీ తరుపున తీవ్ర సంతాపాన్ని మండల ప్రధాన కార్యదర్శి అర్వపల్లి జగన్మోహన్ రావు,citu మండల కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్ లు ప్రకటనలో తెలిపారు.ఖమ్మం జిల్లాలో అనేక కార్మిక ఉద్యమాలలో పాల్గొని సమస్యలకు పరిష్కారం కొరకు నిరంతరం పోరాడినాడని వారు తెలిపారు . ఈరోజు దేశంలో పేదరికము అసమానతలు నిరుద్యోగం తో పాటు కులం మతోన్మాదం తో దూకుడుగా ముందుకు వస్తున్న ఆర్ఎస్ఎస్ బిజెపి విధానాలను ఐక్యంగా తీవ్రంగా ప్రతికటించాల్సిన ఈ సమయంలో శ్రీకాంత్ మరణం ప్రజా.కార్మిక ఉద్యమాలకు,సామాజిక ఉద్యమాలకు,తీవ్ర నష్టం కరమైనదని అన్నివర్గాల పక్షాన ఉద్యమించాడని తను నమ్ముకున్న రాజకీయ విశ్వాసాల కోసం చివర వరకు కొనసాగుతూ ఈరోజు మధురైలో మరణించడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ జోహార్లు తెలుపుతూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం శ్రేయోభిలాషులకు బంధుమిత్రులకు సానుభూతిని తెలియజేస్తున్నాం.
Nice