- ఘనంగా అంబేద్కర్ జయంతి
వేంసూరు,ఏప్రియల్ 14(జనవిజయం): మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల వద్ద సోమవారం రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలోని రైతు వేదిక సమావేశ మందిరంలో మండల వ్యవసాయశాఖ అధికారి పచ్చల రాంమోహన్ ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి మాజీ సర్పంచ్ మహ్మద్ ఫైజుద్దీన్,వంట్లా రమేష్ లు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఏఈవో లు,రైతులు పుష్పాలు వేశారు.