- హైవే సేఫ్టీ రూల్స్ పాటించండి
పెనుబల్లి,ఏప్రియల్11(జనవిజయం):సిపిఎం పెనుబల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో సిఐ ముత్తు లింగంకు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించాలని, లో ప్రథమంగా ప్రభుత్వ హాస్పటల్ నుండి వస్తున్న రహదారునికి ఆపోజిట్ గా ఉన్న నేషనల్ హైవే రోడ్డు దాటే సందర్భాలలో అనేకమందికి యాక్సిడెంట్లు ఐ ప్రాణాలు కోల్పోతున్నారని, తక్షణమే రోడ్డు హైవే వారు, మరియు పోలీసు వారు సహకారంతో , ఇటువంటి దుర్ఘటన అదుపు చేయటానికి తగిన ప్లాను రూపొందించాలని, సిపిఎం పెనుబల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సి.ఐ, ముత్తులింగం గౌడ్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్రావు మాట్లాడుతూ, సిఐ గారు సానుకూలంగా స్పందించారని, తక్షణమే నివారణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని తెలియజేశారు. సిపిఎం మండల కార్యదర్శి గాయం. తిరపతి రావు, మండల కమిటీ సభ్యులు తడికమల చిరంజీవి, మరియు వేణువులు తదితరులు పాల్గొన్నారు.