- జన విజ్ఞాన వేదిక, టి పి ఎస్ కే ఆధ్వర్యంలో కార్యక్రమం
ఖమ్మం,ఏప్రిల్ 14 (జనవిజయం) : జన విజ్ఞాన వేదిక, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఖమ్మం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంబేద్కర్ విరచిత రాజ్యాంగ ప్రవేశికను పఠించడం జరిగింది. రాజ్యాంగాన్ని రక్షించాలని, రాజ్యాంగ హక్కులను కాపాడాలని నినదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అలవాల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు వి మోహన్, ఎస్ వి ఆర్ పురుషోత్తం తాత రాఘవయ్య, రామకృష్ణ, రమేష్, వంజాకు లక్ష్మీ నారాయణ, టి పి ఎస్ కే నాయకులు విప్లవ కుమార్, శ్రీదేవి, వసుంధర, అజిత, ఫరీదా తదితరులు పాల్గొన్నారు.