వేంసూరు,ఏప్రియల్21(జనవిజయం): ప్రజా అవసరాలకు సాయపడటమే మా అభిమతమని వేంసూరు మండల పరిధిలోని అడసర్లపాడు గ్రామానికి చెందిన పుచ్చకాయల వెంకటరెడ్డి అన్నారు.మండల మరియు పరిసర ప్రాంతాలలో ప్రజల అవసరార్థం మరణించిన తన భార్య రాధమ్మ జ్ఞాపకార్థం వెంకటరెడ్డి బాడీ ఫ్రీజర్ ను ఉచితంగా దానం చేశారు.ఈ ఫ్రీజర్ బాక్స్ అవసరమైన వారు వివరాల కోసం ఈ ఫోన్ నంబర్లను 9951586965 – 9908966135 సంప్రదించాలని కోరారు.మరణించిన తమ కుటుంబ సభ్యుల కోసం వాడుకోవాలన్నారు.