- ఎట్టకేలకు భర్తీ అయిన తహశీల్థార్ కొలువు!
- బాధ్యత చేపట్టిన నూతన తహశీల్దార్!
వేంసూరు,మే02(జనవిజయం): ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని తహశీల్దార్ కార్యాలయంలో పని చేసిన నాటి తహశీల్దార్ ఏం. ఏ.రాజు ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసి, నోటు దురుసుగా ప్రవర్తించడం,జర్నలిస్టులను అవమానించి తమ విధులకు ఆటంకం కలిగించి చిట్ట చివరకు జర్నలిస్టులకు క్షమాపణ చెప్పి తిరిగి అదే తీరుగా ప్రవర్తిస్తూ మార్పు చెందక పోవడంతో ప్రభుత్వం బదిలీ చేసి ప్రజలకు న్యాయం చేసింది. అనాకా ఇంచార్జీ తహశీల్దార్ తో నెలలపాటు పరిపాలన కొనసాగింది.ఎట్టకేలకు ఇంచార్జీ పాలనకు ప్రభుత్వం స్వస్థి పలికి తెర దించి పూర్తి బాధ్యతలతో నూతన తహశీల్దార్ ను నియమించగా శుక్రవారం అట్టి అధికారి తహశీల్దార్ జె.మాణిక్ రావు బాధ్యతలు చేపట్టారు.కార్యాలయ సిబ్బంది,గిరిదావర్ లు పూల బొకే లు ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు.ఇంచార్జిగా కొన్ని నెలలపాటు మండల ప్రజలకు సుపరిపాలన అందించిన బాబ్జీ ప్రసాద్ తిరిగి కల్లూరు తహశీల్దార్ కార్యాలయంలో నాయబ్ తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టారు. కొత్తగా వేంసూరు తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన మాణిక్ రావు గతంలో నేలకొండపల్లి మండల తహశీల్దార్ గా పని చేస్తూ బదిలీపై కలక్టరేట్ వెళ్ళి విధులు నిర్వహించి సాధారణ బదిలీల్లో వేంసూరు కు వచ్చినట్లు తాజా సమాచారం.