సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్13(జనవిజయం):ఖమ్మంజిల్లా సత్తుపల్లి పట్టణంలోని- విద్యానగర్ రోడ్ లో నివసించే సీనియర్ పాత్రికేయులు ఏ.బి.ఎన్.ఆంధ్రజ్యోతి విలేఖరి మాదిరాజు సుధాకర్ ఇటీవల తన కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు.అట్టి విషయం తెలుసుకున్న సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదివారం మాదిరాజు నివాసానికి వెళ్ళి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొని పరామర్శించారు.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె చెన్నారావు,చల్లగుళ్ళ నరసింహారావు,కమాల్ పాషా, జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.