కల్లూరు, ఏప్రిల్13(జనవిజయం): రైతులకు అవసరానికి తగ్గట్టుగా గన్నీ సంచులు సరఫరా చేయాలని రైతు సంఘం ఖమ్మంజిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం కల్లూరు మండల పరిధిలోని రావికoపాడు,పుల్లయ్యబంజర గ్రామాలలో గల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను బొంతు పరిశీలించి రైతుల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కనీస సౌకర్యాలు,టర్పాలిన్ లు ఏర్పాటు చేయాలని,కాoటాలు వేసిన వెంటనే ధాన్యం ఎగుమతి చేసి రైతుల ఖాతాలలో సొమ్ము జమ చేయాలన్నారు. బిల్లులు ఇవ్వాలని,బోనస్ చెల్లించాలని కోరారు.తరుగు పేరుతో మిల్లర్లు ధగా చేస్తే సహించమన్నారు.ఆయనతో పాటు తన్నీరు కృష్ణార్జునరావుశీలం సత్యనారాయణరెడ్డి,హనుమంతరావు,అంజయ్య,మాదాల వెంకటేశ్వరరావు,దోమతోట్టి పుల్లయ్య,భట్టు నరసింహారావు లు పాల్గొన్నారు.