Saturday, June 10, 2023
HomeUncategorizedలౌకిక పరిరక్షణే నేటి కర్తవ్యం

లౌకిక పరిరక్షణే నేటి కర్తవ్యం

భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దేశంలో లౌకిక తత్వాన్ని కాపాడవలసిన బాధ్యత అన్ని మతాల ప్రజలపై వుందని ఖమ్మం జిల్లా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు.

 

       లౌకిక పరిరక్షణే నేటి కర్తవ్యం

..నున్నా నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి..

    ఖమ్మం, ఏప్రిల్ 21(జనవిజయం):  భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దేశంలో లౌకిక తత్వాన్ని కాపాడవలసిన బాధ్యత అన్ని మతాల ప్రజలపై వుందని ఖమ్మం జిల్లా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం సీపీఎం పార్టీ వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో 23వ డివిజన్ లో రంజాన్ మాసం సందర్భంగా పలువురికి రంజాన్ కిట్స్ (తోపా) అందజేశారు. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో మతోన్మాదం తీవ్రంగా పెరిగింది అని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు బిజెపి సిద్ధాంతమే లౌకిక ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగా వుందని ఆరోపించారు. గుజరాత్ ముఖ్యమంత్రి గా ఆనాడు మోడీ వున్నప్పుడు కూడా ఆ రాష్ట్రంలో మత కల్లోలాలు ఆ రాష్ట్రంలో తీవ్రంగా జరిగాయి అని, తిరిగి ఇప్పుడు మోడీ ప్రధాని అయిన తరువాత దేశంలో మత ఘర్షణలు బాగా పెరిగాయి అని విమర్శించారు. మతాలు మధ్య చిచ్చు పెట్టడం, దేశాన్ని తాకట్టు పెట్టడం.. ఈ రెండు పనులు మాత్రమే మోడీ ప్రభుత్వం చేస్తుంది అని ఆరోపించారు. ఈ దేశం తిరిగి బాగుపడాలంటే కచ్చితంగా మూడోవ సారి బీజేపీ అధికారంలోకి రానివ్వకుండా చూడవలసిన బాధ్యత ఈ దేశ ప్రజలపై వుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వై విక్రమ్, MA జబ్బర్, పిట్టల రవి, SK బేగం, దాసరి నాగేశ్వరరావు, బాగం అజితా, డాక్టర్ పిల్లలమర్రి సుబ్బారావు, సరస్వతి, పి.రవి, గౌస్, నర్సింగ్ కృష్ణారావు, కూరపాటి శ్రీను, సత్తార్, నాగరాజు, డినేష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

పాపులర్

Recent Comments