Friday, June 27, 2025
Homeవార్తలుటి.డబ్ల్యూ.జె.ఎఫ్.లో భారీ చేరికలు

టి.డబ్ల్యూ.జె.ఎఫ్.లో భారీ చేరికలు

  • జర్నలిస్టుల ప్రయోజనమే టి డబ్ల్యు జె ఎఫ్ లక్ష్యం

వైరా, ఏప్రియల్ 08(జనవిజయం): స్వార్ధపర సంఘాల . చెరనుండి బయటికి వస్తున్న జర్నలిస్టులకు టి డబ్ల్యు జె ఎఫ్ అండగా నిలుస్తుందని ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళ వారం వైరా నియోజక వర్గ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమం వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఆడిటోరియం లో జిల్లా ఉపాధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత రెండు నెలలు గా టి డబ్ల్యు జె ఎఫ్ విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తూ జర్నలిస్టుల అభిమానం చూరగొన్నదని అన్నారు. ఏ సమస్య పరిష్కారానికి ఎవర్ని కలవాలో పథకం ప్రకారం ముందుకు పోతున్నట్లు తెలిపారు. జిల్లా నాయకులు సయ్యద్ ఖదీర్ మాట్లాడుతూ జర్నలిస్టు సంఘమంటే టి డబ్ల్యు జె ఎఫ్ అని నిరూపించు కొంటూ ముందుకు సాగుతున్నాయని అన్నారు. జర్నలిస్టులంటే పదవులు అనుభవించే వారికి బానిసలు కాదని , కలం కార్మికులు గా ఒక ట్రేడ్ యూనియన్ స్వభావం కలిగి సామాజిక బాధ్యతతో జీవించాలని అన్నారు. అదే సందర్భం లో తాము సంఘ జీవులమే అందరికీ లభించే ప్రాధమిక హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందే అర్హత కలిగిన తమను నిర్లక్షం చేయడాన్ని సహించబోమని అన్నారు. నిజాయితీ కలిగిన జర్నలిస్టు లకు ఎదురవుతున్న సవాళ్లను ఎదిరించి వారి ఆత్మగౌరవ ప్రతీక గా టి డబ్ల్యు జె ఎఫ్ ను నిలుపుతామని ఖదీర్ అన్నారు. సీనియర్ జర్నలిస్టు పారుపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తాము స్థాపించిన టి డబ్ల్యు జె ఎఫ్ కు అనేక పేర్లు పెట్టి పబ్బం గడుపుకున్న వారు ఇప్పుడు మన ఫెడరేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల పట్ల ఈర్ష్య ను ప్రదర్శించటం చూస్తున్నారన్నారు. దువ్వా సాగర్, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ ,వేగినాటి మాధవరావు, కూరాకుల గోపి, తదితరులు ప్రసంగించారు. అనంతరం సమావేశానికి హాజరైన జూలూరుపాడు, ఎన్కూర్, వైరా మండలాల జర్నలిస్టులు టి డబ్ల్యు జె ఎఫ్ సభ్యత్వాలు తీసుకున్నారు. కార్యక్రమం జర్నలిస్టులు మేడా సంపత్, సురేష్, గుడిమెట్ల మోహన్ రావు, నాగుల్ మీరా,భూక్యా శ్రీనివాస్, ముదిగొండ మహేష్, రఫీ, గద్వాల రవి, గోవిందా చారి, వెన్నపూస వీరారెడ్డి, సత్తెనపల్లి నరసింహా రావు మానికొండ రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments