సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్17(జనవిజయం): గురువారం ఖమ్మంజిల్లా పెనుబల్లి మండల పరిధిలోని కొత్త కారాయిగూడెం గ్రామానికి చెందిన పోట్రు రాణి తన భర్త సత్యంబాబుతో కలసి ద్విచక్ర వాహనంపై సత్తుపల్లి శుభకార్యానికి వెళ్లి వస్తూ ఉండగా కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో వెనుక నుంచి పల్సర్ బైక్ పై ఇద్దరు వ్యక్తులు వచ్చి మెడలో నాలుగున్నర కాసులు బరువు ఉన్న పుస్తెలు తాడును లాక్కొని వెళ్లారు.నిందితులు లంకపల్లి నుండి పల్లెవాడ,చౌడవరం వైపు వెళ్లినట్లుగా చూసిన వారు చెబుతున్నారు. వియ్యం బంజర పోలీసుల కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.