Wednesday, July 9, 2025
Homeవార్తలుసత్తుపల్లి ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే తనిఖీలు

సత్తుపల్లి ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే తనిఖీలు

సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్,12(జనవిజయం): ఖమ్మంజిల్లా సత్తుపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని శనివారం ఎమ్మెల్యే మట్టా రాగమయిదయానంద్ ఆకస్మికంగా తనిఖీ చేసారు.ఇన్ పేషెంట్, ఔట్ పేషంట్ ల రికార్డులను పరిశీలించారు. ఇన్ పేషెంట్ లకు అందించే ఆహార నాణ్యతను పరిశీలించారు.అందుతున్న వైద్యంపై రోగులను అడిగి తెలుసుకున్నారు.కావలసిన ఔషధాలు ఉన్నాయా లేవా అని ఆసుపత్రి సూపరీడెంట్ కె.ఎల్.వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు.పరిసరాల పరిశుభ్రత,రోగులపట్ల వైద్యుల,సిబ్బంది ప్రవర్తనపై రాగమయి పలు సూచనలు చేశారు.ఈకార్యక్రమంలో:ఆసుపత్రి వైద్యులు,ఆసుపత్రి అభివృద్ధి సహకార కమిటి బాధ్యులు మొరిశెట్టి సాంబశివరావు, ఏమ్.డి.ఫయాజ్ ఆలీ, ఇనపనూరి కుమారి,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నారావు,సీనియర్ నేత చల్లగుళ్ళ నరసింహారావు,కృష్ణారావు,కమాల్ పాషా,సామేలు,మాను కోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments