సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్13(జనవిజయం): ఖమ్మంజిల్లా పెనుబల్లి మండల పరిధిలోని వియం బంజర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం టీఎస్ యుటిఎఫ్ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పతాకావిష్కరణ మండల సీనియర్ నేత వి. తిరుపతి రావు చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో టీఎస్ యుటిఎఫ్ అవిశ్రాంతంగా కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో: జిల్లా కార్యదర్శి వి.రామారావు, మండల అధ్యక్షులు జి వీరస్వామి ప్రధాన కార్యదర్శి కొప్పులశ్రీనివాసరావు, ఆడిటర్ ఎన్ హెచ్ ప్రసాద్ కార్యదర్శులు జి. హనుమంతు,టీ మురళీకృష్ణ,వై.వెంకటరెడ్డి, టి.రమేష్ ఎస్. వెంకటేశ్వరరావు,జె. నాగేశ్వరరావు,టీ.జయ, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.