సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్,13(జనవిజయం):ఖమ్మంజిల్లా సత్తుపల్లి పట్టణంలోని నండూరి సీతారామమ్మ స్మారక టి.ఎస్. యు.టి.ఎఫ్.ప్రాంతీయ కార్యాలయంలో టి.ఎస్.యు. టి.ఎఫ్.12 వ ఆవిర్భావ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.ముందుగా యు.టి.ఎఫ్.ఎర్ర జెండాను సీనియర్ కార్యకర్త,మండల ఉపాధ్యక్షురాలు కనమతరెడ్డి శ్రీదేవి ఆవిష్కరణ చేసారు. ఈ సందర్బంగా శ్రీదేవి మాట్లాడుతూ యు.టి.ఎఫ్. సంఘంలో తాను సభ్యురాలిగా నాయకురాలిగా పని చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అధ్యయనం, సామాజిక స్పృహ లక్ష్యంతో ఏర్పడిన యు.టి.ఎఫ్ చేసే పోరాటాలు ఉపాధ్యాయుల సమస్యలపై మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం,పీడిత ప్రజలకు, కార్మికులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు దోహదపడుతున్నాయన్నారు. సమావేశానికి జిల్లా కార్యదర్శి డి. ఉమామహేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. ఆవిర్భావ సభలో దమ్మపేట మండల అధ్యక్షులు ఆర్. రమేష్,సత్తుపల్లి మండల అధ్యక్షులు చెరుకు శ్రీనివాస్, కార్యదర్శులు కె.వి.రవీందర్ నాధ్,సూరయ్య,సీనియర్ నాయకులు రావెళ్ల అజయ్ కుమార్,సూర్యనారాయణ, నిర్మల్ కుమార్,బాల నాగేశ్వర రావు లు పాల్గొని ప్రసంగించారు.