భూక్యా ను గృహా నిర్బంధం లో ఉంచిన పోలీసులు
వైరా,ఏప్రియల్07(జనవిజయం): సోమవారం గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ భవన్ ముట్టడి చలో హైదరాబాద్ కార్యక్రమం జరగనున్నది.అట్టి నేపథ్యంలో భాగంగా తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మంజిల్లా ప్రధాన కార్యదర్శి,సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రంను చలో హైదరాబాద్ కు వెళ్లకుండా వైరా పోలీసులు గృహా నిర్బంధం చేశారు.ప్రభుత్వాలు అరెస్టులతో,నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేవని,రెట్టింపు ఉత్సాహంతో పోరాటాలు జరుగుతాయన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన చేస్తూ పోలీసుల కాపలాతో పాలన చేయాలని చూస్తున్నారని,అలా చేసిన బి.ఆర్.ఎస్.నేతలకు గత ఎన్నికలలో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఆ స్థితికి కాంగ్రెస్ నెట్టబడుతుందని అన్నారు.