Wednesday, July 9, 2025
Homeవార్తలుమందా కృష్ణ మరువలేని మహోన్నత వ్యక్తి

మందా కృష్ణ మరువలేని మహోన్నత వ్యక్తి

  • జాతోద్ధరణకు శ్రమించిన ఆయుధం
  • ఎమ్మార్పీఎస్ జిల్లా నేత కలపాల యేసు

వేంసూరు,ఏప్రియల్01(జనవిజయం): మాదిగలు మరువలేని,మరువకూడని మహోన్నత వ్యక్తి మందా కృష్ణ అని ఎమ్మార్పీఎస్ జిల్లా నేత కలపాల యేసు అన్నారు.మంగళవారం ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని జయలక్ష్మీపురం గ్రామంలో నిర్వహించిన ఏ.బి.సి.డి.వర్గీకరణ పొందిన విజయోత్సవ సభలో పాల్గొన్న కలపాల మాట్లాడుతూ జాతోద్ధరణకు శ్రమించిన వజ్రాయుధం కృష్ణ అని కొనియాడారు.పాలకులు అమలు చేసే వరకు పోరాటాలకు మాదిగ బిడ్డలు సిద్ధంగా ఉండాలని డప్పు మోగించి తెలిపారు.ముందుగా మందా కృష్ణ ఫ్లెక్సీకు పాలాభిషేకం చేసారు.ఈ కార్యక్రమంలో: అరెంపుల సాంబయ్య,కిన్నెర రత్నకుమార్,గుండాల వీరయ్య,నకరకంటి జమలయ్య,జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు,పుట్టా విజయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments