- జగజ్జీవన్ కు కాంగ్రెస్ నివాళులు
వేంసూరు,ఏప్రియల్05(జనవిజయం): ఖమ్మంజిల్లా వేంసూరు మండల పరిధిలోని అడసర్లపాడు గ్రామంలో గల బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద జగజ్జీవన్117 వ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.ముందుగా విగ్రహానికి కాసర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేసిన మహోన్నత వ్యక్తి జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పని చేసిన వ్యక్తి అని,స్వతంత్ర్య సమర యోధుడు బాబు బాటలో పయనించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు కాసర పిలుపునిచ్చారు.అనంతరం అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో: జిల్లా ఉపాధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి,మాజీ జెడ్పీటీసీ బొమ్మనబోయిన వెంకటేశ్వరరావు,అట్లూరి సత్యనారాయణరెడ్డి,కోటమర్తి సురేష్,వేల్పుల బుచ్చాలు,ప్రేమలత,రావుల పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.