Wednesday, April 9, 2025
Homeవార్తలుసత్తుపల్లి జి.ఎం ఆఫీస్ కు గ్రీన్ సిగ్నల్ : సి అండ్ ఎం.డి హామీ

సత్తుపల్లి జి.ఎం ఆఫీస్ కు గ్రీన్ సిగ్నల్ : సి అండ్ ఎం.డి హామీ

సత్తుపల్లి ఆర్.సి,ఏప్రియల్01(జనవిజయం): సత్తుపల్లి సింగరేణి కొత్తగూడెం ఏరియా జే.వి.ఆర్ ఓసి సందర్శించి వ్యూ పాయింట్ నుండి ప్రాజెక్ట్ పనితీరును పరిశీలించిన సత్తుపల్లి సింగరేణి అధికారులతో కలిసి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం. సింగరేణిలో 11 ఏరియాలలో ఎక్కడా లేనివిధంగా సత్తుపల్లిలో సుమారు 14 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మరియు రావా నాకు సహకరించిన ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేసిన సింగరేణి సి అండ్ ఎం.డి బలరాం. సత్తుపల్లి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగులు , అధికారులు సమిష్టి కృషితో చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఉత్పత్తి సాధించినందుకు గాను శుభాకాంక్షలు తెలియజేసిన బలరాం. సత్తుపల్లిలో సింగరేణి 2005 లో 5 లక్షల టన్నుల ఉత్పత్తి ప్రారంభించి ప్రస్తుతం 114 లక్షల టన్నుల ఉత్పత్తి సాధిస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సత్తుపల్లి ఉద్యోగుల చిరకాల కోరిక సుమారు 20 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం మరియు పలు సమస్యల పరిష్కారాని కొద్ది రోజులలో సత్తుపల్లి జనరల్ మేనేజర్ కార్యాలయం ప్రారంభిస్తామని , ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయమై డిస్పెన్సరీని అన్ని వసతులతో ఆధునికరిస్తామని తెలియజేసిన సి అండ్ ఎం.డి బలరాం. అదేవిధంగా సత్తుపల్లిలో నిర్మించిన సింగరేణి కాలనీని ప్రత్యేకంగా నేనే సందర్శిస్తానని తెలియజేశారు. అతి తొందరలో అన్ని సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సింగరేణి సంస్థ పురోభివృద్ధికి , సంస్థ మనగాడికి ఉద్యోగుల పాత్ర కీలకమని తెలియజేశారు. సింగరేణి సంస్థను కాపాడుకునే బాధ్యత మనందరి పైన ఉందని తెలియజేశారు. భవిష్యత్తులో సింగరేణి సంస్థ నిర్దేశిత లక్షలకు అనుగుణంగా , రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని ఉద్యోగులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షలెం రాజు , జే.వి.ఆర్ ఓసి ప్రాజెక్టు ఆఫీసర్ ప్రహల్లాద్ , కిష్టారం మోసి ప్రాజెక్ట్ ఆఫీసర్ నరసింహారావు , ప్రాజెక్ట్ ఇంజనీర్ శ్రీనివాసరావు , జే.వి.ఆర్ ఓసి మేనేజర్ బెజ్జంకి రాజేశ్వరరావు , కిష్టారం ఓసి మేనేజర్ రామకృష్ణ , సీనియర్ పి.ఓ దేవదాస్ , అధికారులు దుర్గాప్రసాదరావు , రమాకాంత్ , గిడ్ల రాజు , భాస్కరరావు , అఖిల్ , విక్రమ్ బాబు , గోవిందు ఏఐటీయూసీ గుర్తింపు సంఘం నాయకులు సముద్రాల సుధాకర్ , నరసింహారావు , ఐ.ఎన్.టి.యు.సి ప్రాతినిధ్య సంఘం నాయకులు నాగ ప్రకాష్ , రామారావు ఇతరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments