- మనువాదంపై పోరాడడమే ఫూలే కు అర్పించే నిజమైన నివాళి – సిపిఎం
సత్తుపల్లి, ఆర్ సి ఏప్రియల్11(జనవిజయం) : సిపిఎం సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యం లో ఘనంగా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలుసత్తుపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మనువాదంపై పోరాటాలు చేయడమే నేడు జ్యోతిరావు పూలేకు అర్పించే నిజమైన నివాళి అని, మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి అని సిపిఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన పూలే జయంతి సభలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని కుల జాడ్యం మన దేశంలోనే ఉన్నదని, వేల సంవత్సరాలు గా కులం పేరుతో ఆధిపత్యం చేస్తూ సామాజిక, ఆర్థిక దోపిడీ కొనసాగిన దానికి వ్యతిరేకంగా తమ జీవితాంతం సమాజంలో ఉన్న అసమానతలు పై పోరాడిన గొప్ప సామాజిక విప్లవకారులని పూలే దంపతులను కొనియాడారు. నేడు దేశంలో పాలిస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ పాలకులు పచ్చి మతోన్మాద అవకాశవాద రాజకీయాలను నడుపుతూ దేశంలో వైషామ్యాలను రెచ్చగొడుతూ మరల పాతకాలపు నీచమైన రాచరిక వ్యవస్థలోకి తీసుకెళ్ళే దుష్ట ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. పూలే స్పూర్తితో సామాజిక, కుల అణచివేతలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో: రావుల రాజబాబు, చావా రమేష్, మహమ్మద్ అలీ, వెంకటేశ్వరరావు, భాస్కర్ చప్పిడి, బడే మియా, వ లీ , మరియు తదితరులు పాల్గొన్నారు.