- వైభవంగా కొనసాగిన అంకమ్మ తల్లి ఊరేగింపు
- స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ యువతను ఉత్సాహపరిచిన చైర్మన్
- పెద్ద సంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్న యువతీ యువకులు
తల్లాడ,ఏప్రిల్,11(జనవిజయం): తల్లాడ మండలానికి ఐదు కిలోమీటర్ల సమీపాన ఉన్న అన్నారుగూడెం గ్రామంలో వెలసిన గ్రామ ఇలవేల్పులు అంకమ్మ మహాలక్ష్మిమ్మ మద్దిరావమ్మ ల జాతర ఈనెల 10 నుండి 14 వ తారీకుఖు వరకు జరుగుతున్న నేపథ్యంలో మొదటి రోజు కార్యక్రమంగా అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది,ఈ ఊరేగింపు గురువారం సాయంత్రం 8 గంటల నుండి ప్రారంభమై శుక్రవారం సాయంత్రం 7 గంటలకు దేవాలయానికి చేరుకుంటాయి ఈ కార్యక్రమంలో అంకమ్మ తల్లి దేవాలయ కమిటీ చైర్మన్ మరియు తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు స్వయంగా తానే అమ్మవార్ల ఊరేగింపు ట్రాక్టర్ నడుపుతూ యువతను ఉత్సాహపరిచారు. అదేవిధంగా రెండవ రోజు శుక్రవారం కార్యక్రమంగా అమ్మవార్లను ఊయలలూపు కార్యక్రమం, అదేవిధంగా రాత్రి 9 గంటలకు జలబిందులతో గ్రామ పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని దేవాలయ కమిటీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో: దేవాలయ కమిటీ సభ్యులు మారెళ్ళ దేవేందర్, తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు,దొడ్డ చిన్న శ్రీనివాసరావు,పేరసాని నరసింహారావు,దిరిశాల వెంకటయ్య,గోన వేలాద్రి, జాతర కమిటీ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.