- శంభునిగూడెంలో రైతు సంఘం ఆవిర్భావ వేడుకలు
వేంసూరు,ఏప్రియల్ 11(జనవిజయం): ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని శంభునిగూడెం గ్రామంలో శుక్రవారం రాత్రి సిపిఎం అనుబంధ అఖిల భారత రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల కార్యదర్శి అర్వపల్లి గోపాలరావు అధ్యక్షతన నిర్వహించారు.ముందుగా సీనియర్ సభ్యులు అర్వపల్లి రామారావు రైతు సంఘం జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఎం మండల కార్యదర్శి అర్వపల్లి జగన్మోహన్ రావు మాట్లాడుతూ 1936 లో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం సుందరయ్య నాయకత్వంలో రైతు సంఘాన్ని ఏర్పాటు చేశారని నాటి నుండి నేటి వరకు దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పాలకులతో రాజీ లేని పోరాటాలు రైతు సంఘం చేసిందని చేస్తుందని అర్వపల్లి అన్నారు. ఈ కార్యక్రమంలో అర్వపల్లి నరసింహారావు, వెంకటేశ్వరరావు, నున్నా సత్యం,గడిపర్తి సత్యం, నూతి నరసింహారావు, నాగేంద్రం, జమలయ్య, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.