Wednesday, July 9, 2025
Homeవార్తలుమూడునెలలైన వీధి దీపం వెలిగించరా?

మూడునెలలైన వీధి దీపం వెలిగించరా?

  • మూడు నెలలు కావస్తున్న వీధి దీపం వెలిగించరా సారు:సీఐటీయూ
  • కార్యదర్శి ను అడిగి 15 రోజులైనా పట్టదా?

వేంసూరు,ఏప్రియల్06(జనవిజయం): ఖమ్మంజిల్లా వేంసూరు మండల పరిధిలోని వ్యాపార కేంద్రమైన మర్లపాడు గ్రామoలోని భీమవరం వెళ్ళే రహదారిలో బిసి కాలనీ సమీపంలో సుమారుగా వీధి దీపం వెలగక మూడు నెలలు కావస్తున్న వెలిగించరా ఎంపీడీఓ సారు అని సిఐటియు గ్రామ అధ్యక్షులు పర్శా అప్పారావు ఆదివారం మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి గత 15 రోజుల క్రితం కార్యాలయం వద్దకు మండల సీఐటియు కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్ ను తోడ్కొని వెళ్ళి సమస్య తీవత్రను వివరించగా మూడు రోజులలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని ఆరు రోజులు తరువాత చరవాణి ద్వారా అడిగితే ఇంకా అవలేదా చూస్తా అని అంటూ ఆర్చర్యానికి గురి చేశారని నేటికి వీధి దీపం వెలిగించిన పాపాన పోలేదని మూడు నెలల కాలంలో రెండు మూడు సార్లు వీధి దీపాలు మరమత్తులు చేశారని ఆ సమయంలో అక్కడికి వెళ్ళి తెలిపితే వేస్తామని తెలిపి వేయలేదని ఇకనైనా వేయాలని అప్పారావు కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments