భద్రాచలం,13 ఏప్రిల్(జనవిజయం): భద్రాచలం సుందరయ్య నగర్ కాలనీలో గోండ్వానా లైబ్రరీ కార్యాలయంలో జిఎస్ పి రాష్ట్ర కమిటీ సన్నాహక సమావేశంలో పలు తీర్మానాలు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఈ క్రింది తీర్మానాలను చర్చించి ఆమోదించడమైనది.
1-భద్రాచలం కేంద్రంలోని న్యాయ కళాశాలను మంజూరు చేయాలి.
2 దుమ్ముగూడెం మండలంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం పునరుద్ధరించాలి.
3-భద్రాచలం గ్రామపంచాయతీ 45 జీవోను అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలి.
4-భద్రాచలంలో గతంలో కొనసాగిన సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్ ను పునరుద్ధరించాలి.
5-ఏజెన్సీ పాఠశాల టీచర్లకు గిరిజన చట్టాలపై అవగాహన కల్పించి గిరిజన చట్టాలను సిలబస్లో పొందుపర్చాలి.
6-భద్రాచలం ఏజెన్సీలో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వలసవాదులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
7-కోనేరు రంగారావు గారి కమిటీ సిఫార్సులు అమలు చేయాలి.
ఈ సమీక్ష కార్యక్రమంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ఉభయ రాష్ట్రాల కన్వీనర్ సొందే వీరయ్య, రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కనితి వెంకటకృష్ణ, పాయం సన్యాసి, పూనెమ్ వరప్రసాద్, కనితి రాజు, పూనెం నాగేశ్వరరావు, ముక్తి జనార్దన్ రావు పాల్గొన్నారు.
న్యాయ కళాశాల కోసం మహాధర్నా చేయనున్న జీఎస్పీ
RELATED ARTICLES