Sunday, July 14, 2024
Homeరాజకీయంఅంబేద్కర్ ను కొందరివాడిగా కుదించకండి

అంబేద్కర్ ను కొందరివాడిగా కుదించకండి

– టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పల్లా కొండలరావు
– తూటికుంట్లలో ఘనంగా అంబేద్కర్‌ జయంతి

బోనకల్, ఏప్రిల్ 15 (జనవిజయం): అంబేద్కర్ ను కొందరివాడిగా కుదించవద్దని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పల్లా కొండలరావు విజ్ఞప్తి చేశారు. మండలంలోని తూటికుంట్ల గ్రామంలో జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బి.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్‌ విగ్రహానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినవారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పల్లా కొండలరావు మాట్లాడుతూ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగంతో పేదలకు న్యాయం జరిగిందనీ, చాలా విషయాలలో రాజ్యంగం సక్రమంగా అమలు జరుగడం లేదన్నారు. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదనీ, కాలానుగుణంగా అవసరమైనట్లు సవరించుకునే అవకాశం ఉందన్నారు. అంబేద్కర్‌ గొప్ప దార్శినికుడని అన్నారు. పల్లెప్రపంచం ఫౌండేషన్ కార్యదర్శి బోయినపల్లి అంజయ్య మాట్లాడుతూ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. బోనకల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేలాద్రి మాట్లాడుతూ అంబేద్కర్‌ 133వ జయంతి తూటికుంట్ల గ్రామంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి కార్యక్రమం కనివిని ఎరుగని రీతిలో గొప్పగా చేయడం ఆనందంగా ఉందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జై భీమ్ యూత్ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ సమ సమాజ స్థాపనకు,నవ సమాజ నిర్మాణానికి భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ఎంతగానో కృషి చేశారని రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. గ్రామ పెద్దలు పాపినేని రామనరసయ్య మాట్లాడుతూ అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడని, అంబేద్కర్ ఆశయ సాధన కోసం కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ మాజీ సర్పంచ్ నోముల పుల్లయ్య మాట్లాడుతూ అంబేద్కర్‌ బోధించు-సమీకరించు-పోరాడు అనే స్పూర్తితోనే ప్రతీ ఒక్కరూ ముందుకు వెళ్లాలని ముందు మద్యానికి బానిస కాకుండ ఉండాలని అన్నారు. జూనియర్ అసిస్టెంట్ కిరణ్ మాట్లాడుతూ యఅంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో అందరం కలిసి సమ సమాజ నిర్మాణం కోసం పోరాడతామని తెలిపారు. జై భీమ్ యూత్ యువకులు అతిథులతో కలసి కేక్‌ కట్‌ చేసి గ్రామ ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు క్విజ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి డైరీలు నోట్ బుక్స్ అందజేశారు. తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిదులుగా వచ్చినవారిని సత్కరించి వారిని శాలువా మోమెంటో అందజేశారు. ఈ కార్యక్రమ కమిటీ సభ్యులు కంచర్ల చంటి, కంచర్ల రాంబాబు, కంచర్ల నాగేశ్వరరావు, యండ్రాతి సాయి కిరణ్, గంధం జయరాజు, కంచర్ల మన్మధ, కంచర్ల నాగరాజు, ముత్తరపు అభిలాష్, ఇనుపనూరి చింటూ, తగరం రమేష్, కంచర్ల ప్రసాద్, కమిటీ అడ్వైజర్స్, కొల్లి రాంబాబు, కంచర్ల రవీంద్రబాబు, కంచర్ల దినేష్, జుంజులూరి కిరణ్ గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments