దుమ్ము రాకుండా వెంటనే డిపో రోడ్ ప్యాచ్ వర్క్ పూర్తి చేయండి – వై విక్రమ్
ఖమ్మం, నబంబర్ 22(జనవిజయం) : ఖమ్మం నగరంలో ప్రధానమైన బస్సు డిపో రోడ్ అసంపూర్తి పనులు ఫలితంగా పెద్ద ఎత్తున దుమ్ము ధూళి తో టూ వీలర్ చోదకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అని, వెంటనే పనులు పూర్తి చేయకపోతే రోడ్ పై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపడతామని CPM పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ అధికారులను హెచ్చరించారు. శనివారం ఖమ్మం కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వై విక్రమ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రద్దీగా ఉండే డిపో రోడ్ వెడల్పు చేయకుండానే కాంట్రాక్టర్ లాభాలు కోసం డివైడర్ లు కట్టడం ఫలితంగా రోడ్ పై బాగా ట్రాఫిక్ జామ్ తో ప్రజలు ఇబ్బంది పడ్డారు అని తెలిపారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మరింత విచిత్రంగా పనులు ప్రారంభించి డివైడర్ లు తీయడం పేరుతో మరోసారి కాంట్రాక్టర్ లాభాలు కోసం నిధులు కేటాయించి అసంపూర్ణంగా రోడ్ పనులు చేయడంతో దుమ్ము ధూళి వచ్చి టూ వీలర్ చోదకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అని విమర్శించారు. కేవలం డివైడర్ లు తీసి సింపుల్ గా ప్యాచ్ వర్క్ తో పనులు పూర్తి చేయవచ్చు అని కానీ డివైడర్ లు తొలగింపు పేరుతో నిధులు విడుదల చేశారు అని ఆరోపించారు. సదరు కాంట్రాక్టర్ రోడ్ మధ్యలో ప్యాచ్ వర్క్ చేయకుండా అసంపూర్తిగా రోడ్ పనులు వదిలివేయడంతో దుమ్ము బాగా పెరిగి ప్రజలు, టూ వీలర్ వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు అని విమర్శించారు. ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్, మేయర్ ఒకసారి టూ వీలర్ పై డిపో రోడ్ తిరిగితే వారికి ప్రజలు ఇబ్బందులు తెలుస్తాయి అని వై విక్రమ్ సూచించారు. వెంటనే పనులు పూర్తి చేయకపోతే డిపో రోడ్ పై బైఠాయించి రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, నాయకులు టి విష్ణు, జె వెంకన్న బాబు, మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

