Thursday, November 27, 2025
Homeరాజకీయంఖమ్మం కాంగ్రెస్ అధ్యక్షులుగా దీపక్ చౌదరి

ఖమ్మం కాంగ్రెస్ అధ్యక్షులుగా దీపక్ చౌదరి

ఖమ్మం,నవంబర్22 (జనవిజయం): ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులుగా నాగండ్ల దీపక్ చౌదరి నియమితులయ్యారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నూతి సత్యనారాయణ ఎంపికయ్యారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు కూడా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు పూర్తయ్యాయి. కాగా ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైన నాగండ్ల దీపక్ చౌదరికి మంచివాడుగా, పార్టీలో అజాత శత్రువుగా పేరుంది. అన్ని వర్గాల నేతలతో దీపక్ కు సత్సంబంధాలున్నాయి. దీపక్ కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడు. మొదటినుండి కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేశారు. ఉపముఖ్యమంత్రి బఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరితో సత్సంబంధాలు కలిగిన నేతగా , అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు.బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ కోసం ఖమ్మం నగరంలో అవిశ్రాంతంగా పనిచేశారు. పలు సందర్భాలలో నిర్బంధాలను ఎదుర్కొన్న చరిత్ర ఉంది. ఎన్ని గడ్డు పరిస్థితులు వచ్చినా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. గతంలో ఖమ్మం కార్పొరేటర్ గా పనిచేశారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో అతి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు.ఆయన డివిజన్లో ప్రతి ఇంటికి తిరుగుతూ సమస్యలను పరిష్కరిస్తూ, కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నారు. గతంలోనూ పార్టీలో వివిధ పదవులు నిర్వర్తించి, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలలో తన వంతు కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధత గల కార్యకర్తగా పేరు తెచ్చుకున్న నాగండ్ల దీపక్ చౌదరి కి ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి రావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయడంలో తన వంతు కృషి చేయడంతో పాటు, ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా నడిపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నాగండ్ల దీపక్ చౌదరి తెలిపారు.

డీసీసీ కొత్త సారథులకు మంత్రి పొంగులేటి అభినందన…!

ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుల నియామకంపై తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్షులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా తోట దేవి ప్రసన్నను, ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా నూతి సత్యనారాయణను ఏఐసీసీ ప్రకటించింది. అలాగే ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షుడిగా దీపక్ చౌదరి నియమితులయ్యారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి ఈ కొత్త నాయకత్వం కీలక పాత్ర పోషించాలని మంత్రి పొంగులేటి సూచించారు. పార్టీ కార్యకర్తలను సమన్వయ పరచుకుని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత వేగంగా తీసుకువెళ్లడంపై దృష్టిసారించాలన్నారు.

తెలంగాణలో వివిధ జిల్లాలలో కాంగ్రెస్ సారధుల లిస్ట్ దిగువను చూడండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments