జనవిజయంఆంధ్రప్రదేశ్యువతిపై నడిరోడ్డుపై దౌర్జన్యం - వైరల్ అవుతున్న వీడియో

యువతిపై నడిరోడ్డుపై దౌర్జన్యం – వైరల్ అవుతున్న వీడియో

దిగువనున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వైజాగ్ అపోలో హాస్పిటల్ లో పనిచేస్తున్న లక్ష్మి అపర్ణపై పోలీసులు దౌర్జన్యం చేశారని, అకారణంగా ఆమెను రాత్రిపూట పోలీసు స్టేషన్ కు తరలించాలని చూస్తున్నారని ‘ఈ సంఘటన బాధ్యులపై సుమోటోగా హైకోర్టు, జాతీయ మహిళా కమిషన్ చర్యలు తీసుకొనేదాకా సోషల్ మీడియా ద్వారా అందరూ దీనిపై ఉధ్యమించండి’ అంటూ సంఘటనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఇది ఫార్వార్డ్ అవుతోంది. లక్ష్మి అపర్ణ వాదన, పోలీసులు చెప్పేది వీడియోలో చూడవచ్చు. వాట్సాప్ లో మెసేజ్ ను యథాతథంగా దిగువన ఇస్తున్నాము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

———————————–

అపోలో వైజాగు హాస్పిటల్లో డ్యూటీ చేసుకుని ఇంటికి తిరిగి వెళుతున్న లక్ష్మీ అపర్ణపై, నడిరోడ్డుపై పోలీసుల అకారణ దౌర్జన్యం!

డా. సుధాకర్ గారి లాగానే ఈమెనూ నడిరోడ్డుపై చేతులు విరిచి కట్టి నేలమీద పడేశారు. పోలీసు స్టేషన్ కు వచ్చేంత తప్పు ఆ హాస్పిటల్ ఎంప్లాయి ఏమి చేసింది? సహేతుకమైన కారణం లేకుండా ఆడపిల్లను చీకటి పడ్డాక పోలీసు స్టేషన్ కు రమ్మని బలవంతపెడతారా? FIR పెట్టాల్సినంత ఘోరమైన నేరం ఆమె ఏమి చేసింది? కొవిడ్ టైములో డ్యూటీ చేయడమే ఆమె చేసిన నేరమా? లేకపోతే కర్ఫ్యూ టైములో హాస్పిటల్స్ అన్ని మూసివేసి స్టాఫునందరిని ఉదయం 12 గంటలకల్లా ఇంటికి పంపించి వేయమంటారా? “పోలీసు శాఖలో పని చేస్తున్న ఆడవారిని సాయంత్రం డ్యూటీ తరువాత ఇంటికి తీసుకెళ్లడానికి వారి కుటుంబ సభ్యులు కర్ఫ్యూ టైంలో రోడ్డు మీదకు రావడం లేదా? వారికి కూడా ఇలానే రోజూ ఫైన్ వేస్తున్నారా?” అని అడగటమే ఆమె చేసిన నేరమా? డ్యూటీ చేసి ఇంటికి వెళుతున్న “ఆడపిల్లని,” నడిరోడ్డుపై డ్రీంక్ చేసి వస్తున్నావా అని అడగటానికి మీకు నోరెలా వచ్చింది? ఇదేనా దిశా చట్టం అమలు చేసే విధానం? అందరూ చూస్తుండగా, ఆడపిల్లపై నడిరోడ్డుపై మీ నడవడిక చూసినాక, రేపొద్దున మన రాష్ట్రంలో ఏ అమ్మాయైనా సహాయం కోసం మీ దిశ పోలీసు స్టేషన్ గడప తొక్కగలరా? అధికారం ఉందికదా అని, ఆడవారని కూడా చూడకుండా అడ్డమైన కేసులు పెట్టి, నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లాలని చూస్తారా? మీరసలు మనుషులేనా? మహిళా హోమ్ మినిస్టర్ సుచరిత గారు, మహిళా కమిషన్ పద్మ గారు వెంటనే ఆమెతో మాట్లాడాలి. ఈ అవమాన భారంతో ఆ చిన్న పిల్ల ఏ అఘాయిత్యం చేసుకోకుండా ఆమెకు ధైర్యం చెప్పి అండగా నిలవాలి. డ్యూటీకి అటెండ్ అవుతున్న ఫ్రంట్ లైన్ స్టాఫ్ పట్ల మెలగాల్సిన తీరుపై, నడిరోడ్డుపై మహిళలతో వ్యవహరించాల్సిన తీరుపై పోలీసులకు సరైన మార్గదర్శకాలివ్వాలి. ఆ పోలీసులపై వెంటనే శాఖాపర చర్యలు తీసుకోవాలి. చిన్న వయసే అయినా, దౌర్జనానికి వ్యతిరేకంగా ఒంటరిగా ధైర్యంగా, అందరికీ స్పూర్తిదాయకంగా కుమారి లక్ష్మీ అపర్ణ ప్రతిఘటించిన తీరు ఎంతో అభినందనీయం. అమెకు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలి🙏🏻. ఈ సంఘటన బాధ్యులపై సుమోటోగా హైకోర్టు, జాతీయ మహిళా కమిషన్ చర్యలు తీసుకొనేదాకా సోషల్ మీడియా ద్వారా అందరూ దీనిపై ఉధ్యమించండి. ఈరోజు ఆమె! రేపు ఇదే పరిస్థితి మనింటి బిడ్డకు రావచ్చు!! ఈరోజు మనకెందుకులే అనుకుంటే, రేపొద్దున మనకు ఎవ్వరూ తోడురారు! ఇటువంటి అమానవీయ సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేలా చూడాలి! దయచేసి ఈమెసేజ్ అందరికీ చేరేదాకా షేర్ చేయండి.

ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి