జనవిజయంతెలంగాణటిఆర్ఎస్ యువజన విభాగాన్ని బలోపేతం చేస్తాం - చింతనిప్పు కృష్ణ చైతన్య

టిఆర్ఎస్ యువజన విభాగాన్ని బలోపేతం చేస్తాం – చింతనిప్పు కృష్ణ చైతన్య

  • టిఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ పథకాలను అభివృద్ధిని ప్రజలకు వివరిస్తాం
  • ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడతాం
  • ఎం.ఎల్.ఏల సలహాలతో త్వరలో అన్ని మండల మరియు పట్టణ కమిటీలు
  • పటిష్ఠమైన యువజన విభాగంగా తీర్చిదిద్దుతాం

ఖమ్మం,జూన్18(జనవిజయం):ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ అనుబంధ యువజన సంఘాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్లు సంఘం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య ప్రకటించారు. ఖమ్మం లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సంక్షేమ పథకాలు, అభివృద్ధిని, యువతకు కల్పించిన అవకాశాలను ప్రజలకు వివరించడమే, లక్ష్యంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న యువజన విభాగం బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

ప్రతిపక్ష పార్టీలు విద్యార్థులు, నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించారని, ఉద్యోగాల భర్తీలో కూడా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల కంటే మన రాష్ట్రం లో ఉద్యోగ మరియు ఉపాధి కల్పన ఎక్కువగా జరిగిందని అందుకు ఫలితంగానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు స్థానాల్లో కూడా టిఆర్ఎస్ అభ్యర్థుల విజయం సాధించారని, ముఖ్యంగా ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ కే పరిమితమైన ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా విస్తరింపజేసి ముఖ్యంగా ఖమ్మం పట్టణంలో కూడా ఐటీ ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టిన చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో ఇప్పటికే పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కూడా కేసీఆర్ గారికే దక్కుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో త్వరలో స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు సలహాలు సూచనలతో పటిష్టమైన యువజన విభాగం కమిటీలను ఏర్పాటు చేసి తద్వారా ప్రతిపక్ష పార్టీలకు టిఆర్ఎస్ యువజన విభాగం దీటుగా సమాధానం చెప్పే విధంగా తీర్చిదిద్దుతామని, జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత అంతా టిఆర్ఎస్ పార్టీ అండగా నిలవాలని కోరారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి