జనవిజయంజాతీయంకోవిడ్ కట్టడిలో యధా కేంద్రం! తథా రాష్టాలు!!

కోవిడ్ కట్టడిలో యధా కేంద్రం! తథా రాష్టాలు!!

కోవిడ్‌ మరణాల సంఖ్యను వాస్తవాలతో నిమిత్తం లేకుండా ప్రకటిస్తున్న ప్రభుత్వాలు కరోనా ఉధృతి లేదని ప్రచారం చేయడంలో ఆరితేరాయి. ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు….సరికదా ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదు. యధారాజా తథా ప్రజా అన్నట్లుగా కేంద్రంలోని మోడీ అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎక్కువ రాష్ట్రాల సిఎంలు అవలంబిస్తున్నారు. ఆక్సిజన్‌ మరణాలను చూస్తుంటే దేశం ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉందో గమనించవచ్చు. వేలల్లో మరణాలు ఉంటే వందల్లో లెక్కలు చెప్పే దౌర్భాగ్య స్థితిలో పాలకులు ఉన్నారు. కరోనా మరణాలను తగ్గించి అంతా బాగుందని ఫీల్‌గుడ్‌ వ్యవహారంగా చెప్పే ప్రయత్నాల్లో ఆరితేరారు.

ప్రధాని మోడీ వ్వవహారాన్ని తీసుకుంటే దేశానికి, బిజెపికి ఓ ఆశాజ్యోతిగా కనిపించారు. దేశాన్ని ఉద్దరించే పురుషుడు అవరించాడని దేశప్రజలంతా భావించారు. మోడీ భజన బృందం అయితే బుద్దుడితో పోల్చారు. సర్వసంగ పరిత్యాగి అన్నారు. అవినీతిని అంటించుకోరని అన్నారు. కేవలం ప్రజలకోసం అవతరించిన ఉత్తమ పురుషుడిగా కీర్తించారు. అయోధ్యలో రామమందిర శంకుస్థాపన, కశ్మీర్లో 370 అధికరణ రద్దు,ట్రిపుల్ తలాక్‌ మొదలైనవి చరిత్రపుటల్లో నిలిచిపోయే నిర్ణయాలే. మహిళా బిల్లుకు సంబంధించి ఎవరూ ప్రశ్నించడంలేదు. ఈ నిర్ణయాలను చూసి ప్రజలంతా మురిసిపోయారు. ఎక్కడా అవినీతి లేదని భ్రమించారు. కానీ బ్యాంకులకు రుణాల ఎగవేతలు దేశంలో మునుపెన్నడూ లేనంతగా మోడీ హయాంలో జరిగాయి. మునుపెన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగింది. నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటాయి. పెట్రో, గ్యాస్‌ ధరలు దూసుకుని పోతూ అంగారకుడిపై ఉన్న నాసా రోవర్‌ను కూడా తాకాయి.

తొలినాళ్లలో ప్రజల కోసమే అవతరించిన ఉత్తమ పురుషుడిగా బాగా ప్రచారం చేయించుకున్న నరేంద్ర మోడీజీ.. బిజెపిలో అంతా తానే అయ్యారు. ఒకప్పుడు బిజెపికి ఓ పాజిటివ్ ఇమేజ్‌ ఉండేది. ఇప్పుడది మోడీ కారణంగా హారతి కర్పూరంలా కరిగిపోయింది. దాని ఇమేజ్‌ అన్నది లేకుండా పోయింది. మరోమారు ప్రజలకు బిజెపి అంటే వెగటు పుట్టేలా చేశారు. కరోనా విజృంభణ తొలినాళ్లలో కూడా మోడీని అంతా నమ్మారు. కానీ కార్పోరేట్‌ దిగ్గజాలను మరింత ఎత్తున చూడాలన్న సంకల్పంతో తీసుకుంటున్న నిర్ణయాలు కాస్తా దేశాన్ని అధోగతిలోకి పడేసింది. దేశం ఏమయితేనేవిూ అన్న ధోరణిలో మోడీ నిర్ణయాలు ఉంటున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మేస్తామని ఢంకా బజాయించి చెప్పేశారు. త్యాగాలతో ఏర్పడ్డ విశాఖ ఉక్కును కూడా అప్పనంగా అమ్ముతామని నిస్సిగ్గుగా ప్రకటించారు.

ఇంతకాలం ప్రజల్లో సానుభూతి పొందిన మోడీ ఇప్పుడు ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. ప్రస్తుత కరోనా సంక్షభంలో ఆయనకు ప్రజల గురించి కానీ …వారి కష్టాలు కానీ, మరణాలు కానీ, ఆక్సిజన్‌ మరణాలు కానీ పట్టడంలేదు. ఆయన నిర్లక్ష్య ధోరణినే చాలావరకూ ఆయా రాష్ట్రాల సిఎంలు కూడా ఆదర్శంగా తీసుకున్నారు. చనిపోగా మిగిలిన వారు ఉంటే ఆలోచిద్దామన్న రీతిలో ఇప్పుడు మన పాలకులు ఉన్నారు. ఎన్నో మంచి పనులు చేశానని, అవతార పరుషుడినని ప్రచారం చేయించుకున్నప్పటికీ..ప్రజల బాధల ముందు అవన్నీ మంచులా కరిగి పోయాయి. మోడీని ఓ విఫల నాయకుడిగా దుమ్మెత్తి పోస్తున్నారు. కాంలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుందని అంటారు కాని మౌనం అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పదని మోడీ గ్రహించడం లేదు.

మన్మోహన్‌ సింగ్‌ను మౌన మునిగా తిడుతూ దోషిగా నిలిపిన మోడీ ఇప్పుడు అంతకుమించిన మౌనమునిగా మిగిలి పోయారు. అన్నింటికి మించి 370 ఆర్టికల్‌ రద్దు చేయడం,పాక్‌ను ఏకాకి చేయడం అన్నది ప్రపంచ చరిత్రలో అద్భుతమైన విజయంగా చూపి ప్రజల మన్ననలు పొందిన మోడీని ఇప్పుడు గద్దెదిగి పోవాలని దేశంలోని ప్రజలు కోరుకుంటున్నారు. దేశంలో అవినీతి రహిత రాజకీయాలను ప్రజలు కోరుకుంటున్నారు. ఈ దిశగా మోడీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తే ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉండేది. కానీ రాష్ట్రాల సిఎంలు అవినీతిలో కూరుకుపోతున్నా పట్టించుకోవడం లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ రెండో ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలతో పురోగమించాలని కోరుకున్న ప్రజలు ఇప్పుడు కరోనా సంక్షోభాన్ని పట్టించుకోని ప్రధాని ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వైద్య సదుపాయాలు లేక మరణాలు సంభవించడం మనదేశంలో సర్వసాధారణం.

కానీ ఆక్సిజన్‌ కొరత వల్ల జరిగే మరణాలు ఇప్పుడే చూస్తున్నాం. దేశమంతా కరోనాతో అల్లాడుతుంటే, ఆ సమయంలో ఔషధాలను, ప్రాణావసరాలను అందించడంలో చూపిన నిర్లక్ష్యం ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. వైద్యంతో వ్యాపారం చేసేవారు మనుషులేనా అని నిందిస్తున్న వారి రోదనలు పాలకులకు వినపడడం లేదు. మొత్తం విూద సమస్య, ఆక్సిజన్‌ అవసరాన్ని అంచనావేసి ముందుజాగ్రత్తలు తీసుకోకపోయిన కేంద్రప్రభుత్వ తీరు వల్లనే ఈ దుస్థితి ఏర్పడింది. దశాబ్దాల తరబడి అరకొర వసతులు, వనరులతోనే నెట్టుకువస్తున్న భారతదేశంలో ఆరోగ్య వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో కరోనా నిరూపించింది. పడకలు, వసతులు, సిబ్బంది, సాధనాలు, ఔషధాలు.. అన్నీ ఒక్కసారిగా ప్రజలకు అందుబాటులో లేని వస్తువులుగా మారిపోయాయి. రెండో విడత కరోనా విజృంభిస్తుందని నిపుణులు హెచ్చరించినా అధికారపక్షాలు ఎన్నికల మత్తులోనే మునిగితేలాయి. ముందే మేల్కొని ఉంటే పరిస్థితి ఇంతగా చేయి దాటిపోయేది కాదు.

కోవిడ్‌ గత్తర సమయంలో ఆరోగ్య మంత్రిని బర్తరఫ్‌ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కోర్టు మందలింపుల తరువాత కానీ సవిూక్ష చేపట్టలేదు. న్యాయస్థానాలే పరిస్థితిని గమనిస్తూ, ప్రభుత్వాలను అదిలిస్తూ, అవసరమైన ఆదేశాలిస్తూ ప్రజల్లో చిరు ఆశలు కలిగిస్తున్నాయి. తనపై వస్తున్న విమర్శలన్నింటికీ పశ్చిమ బెంగాల్‌లో ఘనవిజయంతో సమాధానం చెప్పాలని మోదీ ఆశించారు. ఇప్పుడు అక్కడ వైఫల్యంతో కనీసం కరోనాపైనయినా శ్రద్ద పెట్టి వుంటే మోడీ నాయకత్వంపై ప్రజలకు నమ్మిక కలిగేది. కానీ అక్కడా ఇక్కడా వైఫల్యాలతో ప్రజల్లో ఉన్న ఆశలు కూడా అడియాశలు అయ్యాయి. పరిస్థితులు, పాలన ఇలాగే కొనసాగితే మొత్తంగా అసమర్థ ప్రధానిగా మోడీ మిగిలిపోక తప్పదేమో!

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి