జనవిజయంఆంధ్రప్రదేశ్నవలా ప్రపంచంలో తిరుగులేని రాణి

నవలా ప్రపంచంలో తిరుగులేని రాణి

యద్దనపూడి సులోచనారాణి వర్ధంతి సందర్భంగా..

హైదరాబాద్‌,మే21(జనవిజయం): నవలా ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ధృవతార, ప్రఖ్యాత రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కన్నుమూసి అప్పుడే రెండేళ్లు అయ్యిందా? అని అనిపిస్తోంది. రెండేళ్ల క్రితం మే 21న ఆమె అమెరికాలో కన్నుమూశారు. యుద్దనపూడి సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ గ్రామంలో జన్మించారు. కుటుంబ కథనాలు రాయడంలో ఆమె తనకు తానే సాటి అని నిరూపించుకుని తెలుగునాట సుప్రసిద్ధ రచయిత్రిగా ఖ్యాతి గడించారు. ’నవలా దేశపు రాణి’గానూ ఆమె ప్రసిద్ధి చెందారు. ఇంతగా సాంకేతికత అందుబాటులో లేని రోజుల్లో ఆమె రాసిన నవలలు గృహిణులకు కాక్షేపంగా ఉండేవి. వివిధ పత్రికల్లో ఆమె రాసిన నవలు సీరియళ్లుగా, ఆ తరవాత సినిమాలుగా వచ్చాయి. అలా ఆమె నవలా ప్రపంచంలో రారాణిగా వెలుగొందారు. ఆమె నవలు వీక్లీలు, మంత్లీల్లో ప్రచురితం కావడంతో ఆమె ఆంధ్ర పాఠకులకు ఆరాధ్య రచయిత్రిగా మారారు. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో కుపర్టినో పట్టణంలో ఆకస్మికంగా గుండెపోటుతో రెండేళ్ల క్రితం స్వర్గస్థులయ్యారు. తెలుగులో పలు ప్రఖ్యాతిగాంచిన నవలు ఆమె రాసి, నవలా చరిత్రలో తిరుగులేని మహారాణి అనిపించుకున్నారు. ఆమె రాసిన నవలల ఆధారంగా అనేక సినిమాలు తీశారు. మధ్యతరగతి జీవితాల గురించి ఆమె అనేక విషయాలను తన నవలల్లో ప్రస్తావించేవారు. 1970 దశకంలో యుద్దనపూడి సులోచనరాణి రాసిన నవలు అనేకం ఎంతో ప్రసిద్ది చెందాయి. ఆమె రాసిన అనేక నవలలు.. సినిమాలు, టీవీ సీరియళ్లుగా తెరకెక్కాయి. విూనా, ఆగమనం, ఆరాధన, అగ్నిపూలు, ఆహుతి, అమర హృదయం, రుతువు నవ్వాయి, కలల కౌగిలి, ప్రేమ పీఠం, బహుమతి, బంగారు కలలు, మౌనతరంగాలు, మౌన పోరాటం, మౌనభాష్యం, వెన్నెల్లో మల్లిక, విజేత, శ్వేత గులాబి, సెక్రటరీ తదితర నవలలు రచించారు. ఆమె రచనల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నవల ’విూనా’. దీని ఆధారంగానే క్రుష్ణ హీరోగా ’విూనా’ చిత్రం తెరకెక్కింది. సెక్రటరీ యద్దనపూడి్ర సులోచనారాణి రచించిన బహుళ ప్రాచుర్యం పొందిన నవల 1964లో తొలిసారి ప్రచురణ పొందిననాటి నుంచి ఎన్నో ముద్రణలు పొంది పాఠకుల ఆదరణను, అక్కినేని నాగేశ్వరరావు హీరోగా సినిమాగా చిత్రితమై ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన యద్దనపూడి సులోచనారాణి రచనలు అనేకం. ఈమె కథలు పలు సినిమాలుగా మలచబడ్డాయి. నవలా సాహిత్య లోకంలో యద్ధనపూడి ఎప్పటికీ చిరంజీవిగానే ఉన్నారు. ఆమె వర్దంతిని పురస్కరించిఉకుని పలువురు సాహితీ మిత్రులు నివాళి అర్పించారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి