జనవిజయంతెలంగాణ‘యాదాద్రి పవర్‌’లో ఆసుపత్రి నిర్మాణం

‘యాదాద్రి పవర్‌’లో ఆసుపత్రి నిర్మాణం

నల్గొండ, మే 19 (జనవిజయం): యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంగణంలో ప్రత్యేక ఆసుపత్రి నిర్మించ తలపెట్టినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. పది రోజుల్లో నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించేలా ఏర్పాట్లు జరగాలని ఆయన అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ఆయన ట్రాన్స్‌కో, జెన్కో సీయండీ దేవులపల్లి ప్రభాకర్ రావుతో కలసి సందర్శించారు. అనంతరం యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టిన బీహెచ్ఈఎల్ అధికారులతో పాటు ట్రాన్స్‌కో, జెన్కో అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రధానంగా వారు చర్చించారు. పనుల్లో జాప్యం జరుగకుండా ఉండేందుకు గాను కార్మికుల్లో ధైర్యాన్ని పెంపొందించేందుకు గాను చేపట్టాల్సిన చర్యలపై మంత్రి జగదీష్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

కోవిడ్ నేపధ్యంలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మిస్తున్న ప్రాంగణంలోనే 20 పడకల ప్రత్యేక ఆసుపత్రి నిర్మించాలని నిర్ణయించారు. ఆ ఆసుపత్రి నిర్మాణం 10 రోజుల్లో పూర్తి చేయడంతో పాటు అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాలని ఆయన సూచించారు. తద్వారా కార్మికుల్లో మనోధైర్యాన్ని పెంపొందించడంతో పాటు సిబ్బందికి వైద్య సదుపాయం అందుబాటులో ఉంచగలుగుతామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో బీహెచ్ఈఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ సిసోడియా, ట్రాన్స్‌కో డైరెక్టర్లు అజయ్, సచ్చితానంద్, టీఆర్‌కే రావు, కోల్ సీయండీ జె‌యస్ రావు, యస్ఈ హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి