జనవిజయంఅంతర్జాతీయంకోవేగ్జిన్ పై కొత్త గందరగోళం - టీకా తీసుకున్న వారిలో ఆందోళన

కోవేగ్జిన్ పై కొత్త గందరగోళం – టీకా తీసుకున్న వారిలో ఆందోళన

  • కోవాగ్జిన్ కు దక్కని డబ్ల్యూ.హెచ్.వో ఆమోదం
  • టీకా జాబితాలో చోటు లేకపోవడంపై ఆందోళన
  • టీకా తీసుకున్నా 14 రోజుల క్వారంటైన్ – ఆందోళన చెందుతున్న విద్యార్థులు

న్యూఢిల్లీ, మే26(జనవిజయం): భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కోవాగ్జిన్ టీకాకు ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద ఆమోదం దక్కలేదు. దీంతో విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. డబ్ల్యూహెవో నుంచి ఆమోదం దక్కకపోవడం వల్ల.. అనేక దేశాలు ఆ టీకాను తమ లిస్టులో చూపించడం లేదు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఈ.యూ దేశాలు ఇంకా కోవాగ్జిన్ టీకాను తమ ఆమోదిత జాబితాలో చేర్చలేదు. వివిధ దేశాల్లో ఉన్న టాప్ యూనివర్సిటీలు.. డబ్ల్యూ.హెచ్.వో ఆమోదం తెలిపిన టీకాలు తీసుకున్నవారికే అనుమతి ఇస్తున్నారు. కోవాగ్జిన్ అప్రూఫ్ట్ లిస్టులో లేదని, దీని వల్ల విద్యార్థులు హోటల్ క్వారెంటైన్ లో ఉండాల్సి ఉంటుందని, 14 రోజుల పాటు హోటల్ లో ఉండడం అంటే చాలా ఖరీదైన అంశం అవుతుందని లైమ్ రిక్ వర్సిటీ అడ్వైజర్ సౌమ్యా పాండే తెలిపారు. డబ్ల్యూహెచ్ వో ఆమోదం పొందిన జాబితాలో – జైర్, మోడెర్నా, కోవీషీల్డ్ టీకాలు మాత్రమే ఉన్నాయి. కోవాగ్జిన్ కు ఆమోదం లభించే షక్రియ కొనసాగుతున్నదని, 60 దేశాల్లో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని, అమెరికా, బ్రెజిల్, హంగేరీ దేశాలు తమ వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. అత్యవసర వినియోగం జాబితాను జెనీవాలోని డబ్ల్యూహెచ్చకు సమర్పించామని, జూలై లేదా సెప్టెంబర్ లోగా తమ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఆమోదం దక్కుతుందని భారత్ బయోటెక్ సంస్థ పేర్కొన్నది. టీకా అనుమతి కోసం డబ్ల్యూహెవోకు సుమారు 90 శాతం డాక్యుమెంట్ పేపర్లను సమర్పించినట్లు భారత్ బయోటెక్ తెలిపింది. జూన్ నెలలో మిగిలిన వివరాలను డబ్ల్యూహెచ్ వోకు సమర్పిస్తామని కంపెనీ పేర్కొన్నది. విదేశీ వర్సిటీల్లో అకాడమి తరగతలు ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ప్రారంభంకానున్నాయి. అయితే ఈ అంశంపై ప్రభుత్వ వర్గాలు కూడా స్పందించాయి. కోవాగ్జిన్ అప్రూవల్ కోసం డాక్యుమెంట్లు సమర్పించేందుకు భారత్ బయోటెక్ తుది దశ పనులు చేపడుతున్నట్లు కేంద్రం చెప్పింది. ఎఫ్.డీ.ఏ సాయంతో అమెరికాలో కోవాగ్జిన్ ట్రయల్స్ కూడా చేపట్టేందుకు ఆ సంస్థ సిద్ధమైనట్లు ప్రభుత్వం పేర్కొన్నది. తమ టీకా తీసుకున్నవారిలో యాంటీబాడీలు ఆరు నుంచి 8 నెలల వరకు ఉంటాయని భారత్ బయోటెక్ పేర్కొన్నది. నాలుగు రకాల కోవిడ్ వేరియంట్లపై ఆ కంపెనీ పేపర్స్ పబ్లిష్ చేసింది. కోవాగ్జిన్ కు ఇప్పటి వరకు 13 దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి దక్కింది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి