సత్తుపల్లి,ఆగస్ట్4(జనవిజయం): లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వీల్ టు మీల్ 35 వ రోజు కార్యక్రమంకు అల్పాహారం వితరణ చేసిన కుమ్మరగుంట్ల దంపతులు. శుక్రవారం పట్టణానికి చెందిన ఓ వ్యాపార సంస్థలో పనిచేస్తున్న గుమస్తా కుమ్మరగుంట్ల వెంకటేశ్వరరావు(కేవీఆర్),అనురాధ దంపతులు తమ కుమారుడు దేవిశ్రీప్రసాద్ 30 వ జన్మదినం సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో లైన్ క్లబ్ వీల్ టు మీల్ కార్య క్రమంలో పాల్గొని పేదలకు,రోగులకు,సిబ్బందికి అల్పాహారం పంపిణీ చేశారు. కుమ్మరగుంట్ల దంపతులను అల్పాహారం స్వీకరించిన ప్రజలు ఆశీర్వదించారు. లైన్ క్లబ్ నిర్వహకులు దొడ్డపనేని కృష్ణయ్య, జంగా సత్యనారాయణ, పెనుగొండ రమేష్ లు కేవీఆర్ దంపతులను అభినందించారు.