జనవిజయంసాహిత్యంవాట్సాప్ దర్శనం! దేనికి నిదర్శనం?

వాట్సాప్ దర్శనం! దేనికి నిదర్శనం?

కొత్త విషయాలు తెలుసుకుందామని
పొద్దున్నే అదుర్దాగా వాట్సాప్ తెరిచాను

ఈ మెసేజ్ పది మందికి పంపిస్తే
పది నిమిషాల్లో శుభవార్త వింటారు…
ఇదే దర్శనం…

ఇక లాభం లేదనుకుని
మరుసటి రోజు కొంచెం
ఆలస్యంగా, తాపీగా తెరిచాను
ప్రాణాలకు తెగించి కరోనాపై
పోరాడుతున్న మోడీజీ….
చప్పట్లు కొట్టండి…
అంటూ దర్శనం..

అమ్మో.. అన్నీ
నిజాలనుకోవాల్సి వస్తోంది..
మరో రోజు మధ్యాహ్నం తీరికగా తెరిచాను…
గోమూత్రం తాగితే అన్ని జబ్బులూ ఫసక్…
హిందువులందరికీ
షేర్ చేయండి..
ఇదే దర్శనం…

రాత్రి పూటైనా మంచి
విషయాలుంటాయేమోనని
ఉసూరుగా తెరిచాను…
మళ్ళీ అదే తంతు..

మూడురోజులుగా అటు వైపు వెళ్ళనేలేదు…
ఈ విషయం నీకు తెలుసా అంటూ మిత్రుడి ఫోన్..
తప్పదన్నట్టుగా  తెరిచి చూసాను…

అసత్యాల మధ్య ఎన్ని నిజాలు
నలిగిపోతున్నాయో..

– నామా పురుషోత్తం
98666 45218
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి