- వాల్ పోస్టర్ ఆవిష్కరణ
కారేపల్లి, జూలై31(జనవిజయం):
కారేపల్లి మండలంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు వచ్చేనెల 10వ తేదీ వరకు గడువు ఉందని. ఈమేరకు ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు, మండల ఎంపీడీవో ఎం. చంద్రశేఖర్, ఎంపీఓ చెరుకుమళ్ళ శ్రీనివాసరావు సూచించారు. సోమవారం మండల ఎంపీడీవో కార్యాలయంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఎక్కువ మంది ప్రవేశాలు పొందేలా ప్రచారం చేస్తున్న క్రమంలో కార్యాలయ ఉద్యోగులు, పంచాయతీ కార్మికులకు, తాసిల్దార్ కార్యాలయంలో వీఆర్ఏలకు, వివిధ కార్యాలయాలలో పనుల కోసం వచ్చిన వారికి అవగాహన కల్పించారు.