— దేశ ఔన్నత్యాన్ని కాపాడుకుందాం
— పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బుడిగం శ్రీనివాస్
ఖమ్మం, ఆగస్టు 15(జనవిజయం : పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెవిలియన్ గ్రౌండ్ అసోసియేషన్ అధ్యక్షులు, 45వ డివిజన్ కార్పొరేటర్ బుడిగం శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించడంతో మంగళవారం మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఈ సందర్భంగా బుడగం శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం నాటి మహనీయుల త్యాగం, ఆశయాలే స్ఫూర్తిగా నేటి యువత తీసుకొని ముందుకు నడవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రాకం శ్యామ్ బాబు, రామనాథం, హరి, బి.నర్సింహారావు, శంకర్, కోటి, అంబాల వెంకటేశ్వర్లు, సత్యం, దామోదర్ రెడ్డి, మాధవి, రమ, శ్రీలత, వనిత, రాణి, పద్మ తదితరులు పాల్గొన్నారు.