కారేపల్లి, జూలై 18(జనవిజయం):
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కారేపల్లి మండల వైద్యాధికారిని డాక్టర్ శ్రేష్ట సాఫల్య అన్నారు. మంగళవారం మండల వైద్యశాలలో ఆమె మాట్లాడారు. ప్రధానంగా దోమలు కుట్టకుండా చూసుకోవాలని సూచించారు. ఇంటి ముందు మురుగునీరు నిల్వలేకుండా చేయాలన్నారు.