ఖమ్మం, ఆగష్టు 10 (జనవిజయం): ఖమ్మంలో గురువారం జరిగిన వీఆర్ఏలకు పే స్కేల్ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ నిన్ననే మీరు రెగ్యులరైజ్ అయ్యి వివిధ శాఖల్లో నియమించబడ్డారని తెలిపారు. ఆగస్ట్ 9వ తేదీన మీ అందరినీ ప్రభుత్వంలోకి తెరుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. మీ నియామకం అయ్యింది. మీరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా అయ్యారు. గ్రామాల్లో గొప్పగా సేవను అందించిన వ్యవస్థ వీఆర్ఏ వ్యవస్థ అన్నారు. గొప్ప సంస్కరణ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. మీరందరూ మీకు ఇచ్చిన శాఖలలో మీ వంతు న్యాయం చేయండని కోరారు. ముఖ్యమంత్రి కేసీఅర్ నాయకత్వంలో వీఆర్ఏలందరికీ న్యాయం జరిగింది. ఎవరికి కూడా అన్యాయం జరగలేదు. గ్రామ సేవకులుగా ఉన్న VRA లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపును ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుదన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి గ్రామ సేవకులుగా సేవలు అందిస్తున్న రాష్ట్రంలోని VRA లు అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వివిధ ప్రభుత్వ శాఖలలో వారి వారి విద్యార్హతల ఆధారంగా వీరిని జూనియర్ అసిస్టెంట్, హెల్పర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ తదితర కేటగిరీలలో నియమించడం జరిగింది. BRS ప్రభుత్వం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.వివిధ శాఖలలో నియామకం పొందిన వారందరికీ నా అభినందనలు తెలుపుతున్నానన్నారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ బహుశా నేటి నుండి వీఆర్ఏ అనే పదం రద్దవుతుంది. సుధీర్ఘ కాలంగా పే స్కేల్ కావాలని ఎన్నోసార్లు ఉద్యమాలు చేశారు. గొప్ప సమస్యకు పరిష్కారం చూపిన సీఎం కెసిఆర్ కి ధన్యవాదాలు. గ్రామాల్లో ఏ పని వచ్చిన ప్రభుత్వానికి చేవు కన్ను లెక్క పని చేస్తారు.మన జిల్లాలో 175 మంది రెవెన్యూ వ్యవస్థకు బదిలీ చేయబడ్డారు. సీఎం కెసిఆర్ నిర్ణయాలు మానవీయ కోణంలోనే ఉంటాయి. ఆయన తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు పార్టీలకు సంబంధం లేకుండా అందిస్తున్నారు. సత్తుపల్లి 7, 8 వైకుంఠ దామలను చూపిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. ఆర్టీసీ ని కూడా ప్రభుత్వంలో విలీనం చేసిన గొప్ప ప్రభుత్వం అన్నారు.