జనవిజయంఆంధ్రప్రదేశ్ఓటుకు నోటులో చంద్రబాబుకు ఊరట

ఓటుకు నోటులో చంద్రబాబుకు ఊరట

  • ఓటుకు నోటు కేసులో కీలక మలుపు
  • ఎసిబి చార్జిషీట్ ఆధారంగా రేవంత్ పై ఈడీ కేసు
  • దాదాపు ఆరేళ్ల తరవాత ఈడి ఛార్జిషీట్ దాఖలు
  • మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట

హైదరాబాద్, మే27(జనవిజయం): ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరిగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ కేసులో ఊరట లభించింది. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఎంపీ రేవంత్ రెడ్డిపై చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఓటుకు నోటు కేసులో దాదాపు ఆరేళ్ల తర్వాత ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది. గతంలో ఏసీబీ దాఖలు చేసిన చార్జ్ షీట్ ఆధారంగా ఈడీ రేవంత్ పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. తాజాగా దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డితోపాటు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా నిందితుడిగా పేర్కొంది. అలాగే సెబాస్టియన్, ఉదరునింహ, మత్తయ్య, వేం కృష్ణకీర్తన్ పేర్లను నమోదు చేసింది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు.. ఎమ్మెల్యే స్టీఫెన్ కు రేవంత్ ముడుపులిచ్చి ప్రలోభపెట్టారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో రేవంత్ మనీలాండరింగ్ నేరానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ ఛార్జ్ షీట్ ఆధారంగా రేవంత్ రెడ్డిపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. రేవంత్ తో పాటు టీడీపీ నాయకుడు వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం కృష్ణా కీర్తన్ రెడ్డిపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఎమ్మెల్యే స్టీఫెన్ నన్ను రూ.50 లక్షలు ఇస్తుండగా రేవంత్ రెడ్డి పట్టుబడ్డ విషయం తెలిసిందే. 2015 మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసే విధంగా స్టీఫెన్ తో రేవంత్ రాయబారం సాగించాడు. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యే స్టీఫెన్ ను ప్రలోభాలకు గురిచేశారని ఏసీబీ అభియోగం. మొత్తం 4.5 కోట్ల బేరంలో మొదటగా రూ. 50 లక్షలు చెల్లించారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2015 మే 31న జరిపిన స్టింగ్ ఆపరేషన్లో రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ పట్టుకుంది. ఈ కేసులో ఏపీ మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. స్టీఫెనతో రాయబారం నడిపిన నేపథ్యాన్ని గతంలో దొరికిన వీడియోలను కూడా ఈ కేసులో ఆధారాలుగా సేకరించారు. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు చెబుతున్నారు. ఈ డబ్బులు ఏ విధంగా వచ్చాయి.. ఎలా చేతులు మారాయి.. అన్నీ సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఈడీ ప్రధాని నిందితుడిగా ఈడీ చేర్చింది. 2015 మే 31న స్టీఫెననను అతని ఇంట్లో రూ. 50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి వీడియో కెమెరాకు చిక్కారు. అయితే ఆరేళ్ల పాటు వివిధ కోణాల్లో విచారించిన ఈడీ అనేక ఆధారాలను సేకరించింది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి