భద్రాచలం,ఆగస్టు 30 (జనవిజయం) : రాబోయే శాసనసభ ఎన్నికలు-2023 కొరకు ఆగస్టు 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన జారీ చేసినట్లు 110- పినపాక (ఎస్టి) నియోజకవర్గం ఎన్నికల అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 2, 3 తేదీలలో ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. నియోజక వర్గ పరిధి లో ఓటు నమోదు బూతు లెవెల్ ఆఫీసర్లు (బి ఎల్ ఓ) లను సంప్రదించాలని ఆయన సూచించారు. దీనికి తోడు భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలో ఓటర్ సహాయక కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సదరు పినపాక నియోజకవర్గం ఓటర్లు 08743- 232 244 నెంబర్ కు ఫోన్ ద్వారా కార్యాలయ పని వేళల్లో సంప్రదించగలరని ఆయన కోరారు.