జనవిజయంతెలంగాణవిత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాలి - మంత్రి పువ్వాడ అజెయ్ కుమార్

విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాలి – మంత్రి పువ్వాడ అజెయ్ కుమార్

ఖమ్మం,జూన్9(జనవిజయం): జిల్లాలో వానాకాలం పంటసీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విత్తనాలు, ఎరువులను సకాలంలో అందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం టి.టి.డి.సి సమావేశ మందిరంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో వానాకాలం పంటసాగు సన్నద్ధం, విత్తనాలు, ఎరువుల లభ్యత, మిగిలిన ధాన్య సేకరణ, సేకరించిన ధాన్యం మిల్లులకు తరలింపు, రేషన్ కార్డుల మంజూరు, కోవిడ్ తీవ్రత, లాక్ డౌన్ అమలు, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటుకు స్థల సేకరణ తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో యాసంగి ధాన్య సేకరణలో భాగంగా ఇప్పటి వరకు 3,42,792 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసామని మిగిలిన 6, 372 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ నెల 15 లోగా కొనుగోలు, మిల్లులకు తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి చివరి బస్తావరకు కొనుగోలు చేస్తామని రైతులు అందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. ఇంకనూ మిల్లులకు తరలించాల్సిన 39,633 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించబడిన మిల్లులకు సత్వరమే తరలించాలని, రవాణా విషయంలో సత్వర చర్యలు చేపట్టి రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్య సేకరణ ప్రక్రియ పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు. వానాకాలం పంటసీజన్ కు సంబంధించి జిల్లా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తదనుగుణంగా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో విత్తనాలు, ఎరువులను రైతులకు అందించాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో 129 క్లస్టర్లలో ప్రతి రైతు వేదికలో వ్యవసాయ విస్తరణాధికారి రైతులకు అందుబాటులో ఉండి విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్ళాలని మంత్రి వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. జిల్లాలో వానాకాలం సీజన్లో 5 లక్షల 90 వేల ఎకరాలలో వివిధ పంటల సాగు లక్ష్యాలకనుగుణంగా 15,461 క్వింటాళ్ళ వరి, 3. 5 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు, 69 క్వింటాళ్ళ మిర్చి విత్తనాలు, 2,283 క్వింటాళ్ళ పెసరవిత్తనాలు, 2,600 క్వింటాళ్ళ మినుములు, 739 క్వింటాళ్ళ కందులు, 466 క్వింటాళ్ళ వేరుశనగ విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా 80,718 మెట్రిక్ టన్నుల యూరియా అవసరంకాగా ఇప్పటికే 21,403 మెట్రిక్ టస్నుల యూరియా అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఈ నెల 15 నుండి రైతుబంధు నగదు రైతులకు అందించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి కాకుండా ఇతర రాష్ట్రాల దృవీకరణ ప్రతాలతో నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు.

జిల్లాలో ఇప్పటికే దరఖాస్తు చేసుకొన్నవారిలో అర్హులైన వారందరికి రేషన్ కార్డు మంజూరుకు సత్వర చర్యలు తీసుకోవాలని పౌర సరఫరా శాఖాధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు జిల్లాలో ఇప్పటికే దరఖాస్తు చేసుకొని పెండింగ్ లో ఉన్న 18,768 దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికి రేషన్ కార్డు మంజూరుకై సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లాలో రైస్ మిల్లుల ఏర్పాటుకు ఔత్సాహికులైన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మంజూరు చేసిన స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని సేకరించి ప్రతిపాదనలు సత్వరమే సమర్పించాలని జిల్లా యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. జిల్లాలో సరిపడా రైస్ మిల్లులు లేకపోవడం వల్ల మన జిల్లాలో సేకరించిన ధాన్యం ఇతర జిల్లాలకు పంపడం జరిగిందని, ఇతర స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు ద్వారా జిల్లాలోనే విరివిగా రైస్ మిల్లులను ఏర్పాటు చేసుకునే సౌలభ్యం కలుగుతుందన్నారు. జిల్లాలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుచేసుకొని వచ్చే ఖరీఫ్ నాటికి రైస్ మిల్లులు నడిచే విధంగా సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం వల్ల జిల్లాలో కోవిడ్ పాజిటివ్ రేటును 33 శాతం నుండి 8 శాతానికి తగ్గించగలిగామని, దీనితోపాటు ఇంటింటి జ్వర సర్వేవల్ల కరోనాను కట్టడి చేయగలిగామని సత్తుపల్లి, మధిర నియోజకవర్గంలో అధిక కేసులు కలిగిన గ్రామాలలో వైద్య బృంధాలను మరింత పెంచాలని, జిల్లా సరిహద్దు గ్రామాలలో కూడా పూర్తిగా పాజిటివ్ రేటును తగ్గించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలో “సెకండ్ వేవ్”ను సమర్ధవంతంగా కట్టడి చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగాన్ని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఈ నెల 10 వ తేది నుండి అమలుకానున్న సాయంత్ర 6.00 గంటల నుండి ఉదయం 6.00 గంటల వరకు లాక్ డౌనను కఠినంగా అమలు చేయాలని, జిల్లా సరిహద్దు ప్రాంతాలపై నిఘా మరింత పెంచాలని, పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు.

పార్లమెంట్ సభ్యులు నామానాగేశ్వరరావు మాట్లాడుతూ మిగిలిన ధాన్య సేకరణ, రవాణా విషయంలో ఉన్న సమస్యలను అధిగమించి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. వానాకాలం సీజన్ లో విత్తనాలు, ఎరువుల పంపిణీలో అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉండాలని సకాలంలో విత్తనాలు, ఎరువులను రైతుకు అందించాలని సూచించారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటులో రైస్ మిల్లులతో పాటు ఇతర యూనిట్ల స్థాపనకు అన్ని విధాల అనుకూలమైన స్థల సేకరణ జరగాలని, తద్వారా జిల్లాకు ప్రత్యేకత రావాలని ఆయన కోరారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలో “కోవిడ్ సెకండ్ వేవ్” లాక్ డౌన్ పరిస్థితులలో కూడా మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే సేకరించి మిల్లులకు తరలించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇంటింటి జ్వరసర్వే, ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు ద్వారా కరోనాను కట్టడి చేయగలిగామని జిల్లా టాస్క్ఫోర్స్ అధికారుల బృంధం సమర్ధవంతంగా విధులు నిర్వర్తించడం ద్వారా జిల్లాలో అక్రమ ఇంజక్షన్లు, ఔషధాల విక్రయాలను నియంత్రించగలిగామన్నారు. సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలలో కూడా కరోనాను పూర్తిగా కట్టడిచేస్తామని, జిల్లాలో ఇప్పటికే దరఖాస్తు చేసుకొని ఉన్న రేషన్ కార్డుల దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారందరికి రేషన్ కార్డులను అందిస్తామని కలెక్టర్ తెలిపారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు ఇప్పటికే రెవెన్యూ సర్వే అధికారుల బృంధం స్థల సేకరణ ప్రక్రియ చేపట్టిందని, త్వరలోనే స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు సమర్పిస్తామన్నారు.

శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు లావుడ్యా రాములునాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర మేయర్ పునుకొల్లు నీరజ, పోలీసు కమీషనర్ విష్ణు. యస్. వారియర్, నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూథన్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి