పట్టణ బులియన్ మర్చంట్స్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు
భద్రాచలం, 17 సెప్టెంబర్(జనవిజయం):
భద్రాచలం పట్టణం బులియన్ మర్చంట్స్ స్వర్ణకారసంఘం వారి ఆధ్వర్యంలో.. సర్వసృష్టికి మూలపురుషుడైన శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడమైనది .ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు శ్రీ ఇజ్జాడ దుర్గా ప్రభాకర్ జీ విశ్వకర్మ పతాకావిష్కరణ గావించగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కడియం రామాచారి పూజామండపం ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లోప్రధాన కార్యదర్శి దార్ల బ్రహ్మానందాచార్య దేవాదుల రమణ, పెందోట బ్రదర్స్ ,ముండూరి.సత్యన్నారాయణ .విక్రమ్, వరబాబు,రవి,మల్లిబాబు, చిట్టి మోజు నాగేశ్వరరావు, ప్రకాష్ మరియు పాలకవర్గ సభ్యులు యావన్మంది పాల్గొన్నారు