జనవిజయంఆంధ్రప్రదేశ్విశాఖ రాజధాని వైపుగా వేగంగా జగన్ అడుగులు

విశాఖ రాజధాని వైపుగా వేగంగా జగన్ అడుగులు

  • విశాఖకు రాజధాని తరలిపోవడం ఖాయమేనా
  • బొత్స, విజయసాయిల సంకేతాలు ఇందుకేనా
  • ఉద్యోగులను ఎలా ఒప్పిస్తారన్నదే ప్రశ్న

అమరావతి, జూన్ 14(జనవిజయం): అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల అంశాన్ని చేపట్టిన జగన్ రెడ్డి ఆ దిశగా ఇప్పుడు అడుగులు వేగంగా వేస్తున్నారు. త్వరగా రాజధానిని విశాఖకు తరలించే చర్యలు చాపకింద నీరులా సాగుతున్నాయి. ఇటీవల మంత్రి బోత్స సత్యనారాయాణ, ఎంపి విజయసాయిరెడ్డిలు దీనిపై పదేపదే ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. దీనితో ఒక్క రాజధానికి కూడా దిక్కులేని రాష్ట్రం మూడు రాజధానుల ఆటలో మునిగిపోయింది. ప్రజలు కూడా ఇందుకు అనుగుణంగా విడిపోయారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలని, నీరూ భూమి పుష్కలంగా అందుబాటులో ఉండాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ వెల్లడించారు. ఇప్పుడు అందుకు భిన్నంగా గత రెండేళ్లుగా ఆయన తన కార్యాచరణను కొనసాగిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అన్న కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు.

జగన్ తీసుకున్న నిర్ణయం అద్భుతం, అమోఘం అని మంత్రులు అభినందిస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులు తమ ఎజెండా ప్రకారం చేస్తున్న ప్రకటనలు ప్రజలను మరింత అయోమయానికి గురిచేస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలో శాశ్వతంగా ఉండదన్న విషయాన్ని గమనించడం లేదు. కనీసం ఉద్యోగుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. అలాగే కోర్టులో ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు రాలేదు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని తమ సొంత ఎజెండాను అమలు చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొవిడ్ చిన్నాభిన్నం చేయడమే కాకుండా ప్రజల జీవితాలను ఆగం చేస్తోంది. అయినా ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించని ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి విషయంలో పెద్దగా పట్టింపు లేకుండా ఉన్నారు. ఇదే సమయంలో మూడు రాజధానుల పేరిట ముఖ్యమంత్రి జగన్ బిజీగా ఉన్నారు. విశాఖకు రాజధాని తరలిపోవడం ఖాయమని ఇటీవలే మంత్రి బొత్స మరోమారు ప్రకటించారు.

ప్రభుత్వ నిర్ణయంతో తమకు ఏదో ఒరిగిపడుతుందన్న ఆశతో కొందరున్నారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులది అరణ్య రోదనగా మిగిలిపోతోంది. కరోనా వైరస్ బారిన పడినవారు వైద్యం కోసం చేస్తున్న ఆక్రందనలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అమరావతి కోసం ప్రయాస పడుతోంది. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కూడా పోరాడుతున్నా లాభం లేకుండా పోయింది. రాజధాని ఎంపిక నిర్ణయం రాష్ట్రాల పరిధిలోనిదని, కేంద్రానికి ఏ పాత్రా ఉండదని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించడంతో జగన్ తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కోర్టులో తీర్పు ఎలా రానున్నా కార్యనిర్వహాక రాజధాని విశాఖకు తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మంత్రులు, ఎంపిలు ఇందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సచివాలయు ద్యోగులు ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది ముఖ్యం. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పట్ల సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ఇటీవల కరోనాతో పలువురు మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో వారు రాజధాని తరలింపు అంటేనూ భయపడుతున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే ప్రభుత్వం కక్షపూరిత ధోరణి అవలంబిస్తుందేమోనన్న భయంతో ఊపిరి బిగబట్టి ఉన్నారు.

డీఏలు, పీఆర్‌, కరోనా కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులు, కొవితో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగ భద్రతతోపాటు కారుణ్య నియామకాలు కల్పించాలని వారు కోరకుంటున్నారు. రాజధాని అమరావతిగా ఉంటుందని పలువురు ఉద్యోగులు ప్లాట్లు కొనుగోలు చేసి ఆర్థికంగా చితికిపోయారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో వీరందరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానులు మారిస్తే తమ పరిస్థితి, తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కరోనా దెబ్బకు పలు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని, 11వ పీఆర్, డీఏ సకాలంలో రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, వాపోతున్నారు. సచివాలయంలో కరోనా సెకండ్ వేవ్ లో 13మంది ఉద్యోగులను కోల్పోయామని, వారి కుటుంబాలకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, కంపానినేట్ అపాయింట్ మెంట్ త్వరితగతిన ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ఉద్యోగుల పిల్లలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరుతున్నారు. కొవిడ్ వల్ల మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలంటున్నారు. ఉద్యోగుల పదోన్నతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి